-->
Badvel By Election: ఈరోజే బద్వేల్ ఉపఎన్నిక.. పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి..

Badvel By Election: ఈరోజే బద్వేల్ ఉపఎన్నిక.. పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి..

Badvel

ఆంధ్రప్రదేశ్‎ కడప జిల్లాలోని బద్వేల్‎ ఉపఎన్నిక పోలింగ్‎కు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరనుంది. ఇక్కడ మొత్తం 15 మంది బరిలో నిలిచారు. నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో 221 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. శుక్రవారం సాయంత్రమే పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ ఉపఎన్నికకు 3000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా వైసీపీ, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది.

బద్వేల్‌ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి పనతల సురేశ్‌ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాయి. నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,16,139 ఓటర్లు ఉన్నారు. అందులో 1,07,340 మహిళలు ఉండగా.. 1,08,799 పురుషులు ఉన్నారు. ఇక్కడ 914 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 7(బద్వేలు, కలసపాడు, బి.కోడూరు, ఎస్‌.ఎ. కాశినాయన, పోరుమామిళ్ల, గోపవరం, ఆల్టూరు) మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ 6 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతరులు 3 సార్లు విజయం సాధించారు.

Read Also.. Badvel Election Bypoll: బద్వేల్ ఎన్నికలకు వరుణుడి ఎఫెక్ట్.. తీవ్ర ఇబ్బంది పడుతున్న పోలింగ్ సిబ్బంది..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3jOKEhD

Related Posts

0 Response to "Badvel By Election: ఈరోజే బద్వేల్ ఉపఎన్నిక.. పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel