-->
AP Weather Report: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన..

AP Weather Report: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన..

Ap Weather Alert 2

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాగల 3-4 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‎లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం:
ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

‌ ‌

Read Also.. Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైరు పేలి లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి

Permanent Pension: ఆధార్ కార్డ్ హోల్డర్లకు గుడ్ న్యూస్.. e-KYC తెరిచి ఇంట్లోనే సంపాదించండి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3jSvzLP

Related Posts

0 Response to "AP Weather Report: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel