-->
AP Bandh: నేడు ఏపీలో బంద్‌.. టీడీపీ నేతల ఆందోళన.. ముందస్తు అరెస్టులు.. రంగంలోకి ప్రత్యేక పోలీసు బలగాలు

AP Bandh: నేడు ఏపీలో బంద్‌.. టీడీపీ నేతల ఆందోళన.. ముందస్తు అరెస్టులు.. రంగంలోకి ప్రత్యేక పోలీసు బలగాలు

Ap

AP Bandh: ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఆయన ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. వైసీపీ నేతల దాడికి నిరసనగా టీడీపీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. రెండు పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. వైసీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ముందస్తు అరెస్టులు..

దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రోడ్లపై నిరసనకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలిస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తుతోంది. కనిగిరి బస్టాండులో టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే విశాఖ, శ్రీకాకుళం బస్టాండు దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో నిరసనగా దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒంగోలులో టీడీపీ నేతలను అరెస్టు చేశారు.

ఇవీ కూడా చదవండి:

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసిన పట్టాభి వ్యాఖ్యలు.. చంద్రబాబుపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు..!

AP Politics: రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు: డీజీపీ కార్యాలయం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DWhbd7

Related Posts

0 Response to "AP Bandh: నేడు ఏపీలో బంద్‌.. టీడీపీ నేతల ఆందోళన.. ముందస్తు అరెస్టులు.. రంగంలోకి ప్రత్యేక పోలీసు బలగాలు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel