-->
Andhra Pradesh: జగనన్న తోడు పథకం.. నేడు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్న సీఎం జగన్..

Andhra Pradesh: జగనన్న తోడు పథకం.. నేడు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్న సీఎం జగన్..

Ys Jagan

Jagananna Thodu: రాష్ట్రంలో అధిక వడ్డీల భారి నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం జ‌గ‌న‌న్నతోడు ప‌థ‌కాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇవాళ తాడేప‌ల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో న‌గ‌దు జ‌మ‌చేయ‌నున్నారు. 2021 నాటికి సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్దిదారులకు రూ.16.36 కోట్ల వడ్డీని ప్రభుత్వం ల‌బ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జ‌మ చేయ‌నుంది.

రాష్ట్రంలో చిరు వ్యాపారులు వ‌డ్డీ వ్యాపారుల భారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం తీసుకువచ్చింది. దీనిలో భాగంగా తొలిదశలో 2020 నవంబర్‌లో రుణాలు తీసుకుని 30 సెప్టెంబర్, 2021 నాటికి సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వ‌డ్డీ చెల్లించ‌నుంది. జూన్‌ 2021లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్దిదారులకు కూడా వారి రుణ కాల పరిమితి ముగియగానే సదరు వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లించ‌నుంది. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం క్రింద ఇవాళ రూ.16.36 కోట్ల వడ్డీని 4,50,546 మంది లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జ‌మ చేయ‌నుంది ప్రభుత్వం.

జ‌గ‌న‌న్న తోడు పథకం క్రింద బ్యాంకుల్లో ఒక్కోక్క చిరు వ్యాపారికి ఏటా 10 వేల రుపాయిలు వ‌ర‌కు వ‌డ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప‌ది వేల రుపాయిల‌కు ఏడాదికి అయ్యే వ‌డ్డీని ప్రభుత్వం నేరుగా ల‌బ్దిదారుల‌కు అందింస్తుంది. ఇప్పటివరకు మొత్తం 9,05,458 మంది ల‌బ్దిదారుల‌కు రూ. 905 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించింది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అంద‌జేస్తుంది. బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని ల‌బ్దిదారులు తిరిగి చెల్లించిన తర్వాత మ‌ర‌లా వారు బ్యాంకుల నుండి మళ్ళీ వడ్డీ లేని రుణం తీసుకోవ‌చ్చని ఏపీ సర్కార్ ప్రకటించింది.

Also read:

Telugu Desam Party: సొంత పార్టీ నేతల ఝలక్ ఇస్తున్న చంద్రబాబు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

YCP vs TDP Clashes: నోటికొచ్చినట్లు తిడితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..

Telangana Srimantudu: యాభై ఏళ్లైనా పుట్టి పెరిగిన ఊరుపై తరగమని మమకారం.. తానున్నానంటూ ముందుకొచ్చిన శ్రీమంతుడు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Xs69wG

Related Posts

0 Response to "Andhra Pradesh: జగనన్న తోడు పథకం.. నేడు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్న సీఎం జగన్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel