-->
చాణక్య నీతి: ఆ 4 విషయాలలో మహిళలు పురుషుల కంటే ముందుంటారు..!

చాణక్య నీతి: ఆ 4 విషయాలలో మహిళలు పురుషుల కంటే ముందుంటారు..!

Chanakya Niti

చాణక్య నీతి: ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన వ్యూహకర్త, ఆర్థికవేత్త. చాణక్యుడు విష్ణుగుప్తుడి కాలంలో కౌటిల్యుడిగా పిలువబడ్డారు. అతను చిన్న వయస్సులోనే అనేక గ్రంథాలు, పురాణాలు చదివారు. చాణక్య శత్రువు పరమానందని తన తెలివితేటలతో ఓడించి నంద వంశాన్ని నాశనం చేశారు. చాణక్య అనేక పుస్తకాలు, గ్రంథాలు రాశారు. చాణక్య తన జీవితానుభవాలను చాణక్య నీతిలో పద్యాల ద్వారా అద్బుతంగా రాశారు. జీవితంలోని అన్ని అంశాలను ప్రస్తావించారు. చాణక్య నీతిలో రాసిన విషయాలను అనుసరించడం ద్వారా జీవితానికి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఆచార్య చాణక్య తక్షశిలలో చాలా సంవత్సరాలు బోధించారు. తరచుగా ఆయన గ్రంథాలలో పురుషులు, స్త్రీల కంటే ఎక్కువ బలవంతులని నిరూపణ అయ్యారు. చాణక్య రాసిన నీతి గ్రంథంలో స్త్రీలు ఈ నాలుగు విషయాలలో పురుషుల కంటే ముందుంటారని చెప్పారు.

1. ఆచార్య చాణక్య ప్రకారం.. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఆహారం తింటారు. చాణక్య ‘స్త్రీనాం దివ్గుణ ఆహారో’ అని రాశాడు. దీని అర్థం పురుషుల కంటే మహిళలు రెండింతలు ఆకలితో ఉంటారని, ఎందుకంటే వారు అతని కంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తారని తెలిపారు.
2. చాణక్య ప్రకారం.. పురుషుల కంటే మహిళలు చాలా తెలివైనవారు. వారి తెలివితేటలను పురుషుల కంటే అనేక విధాలుగా మెరుగ్గా ఉపయోగిస్తారు. మహిళలు ప్రతి సమస్యను భయం లేకుండా ఎదుర్కొంటారు.
3. చాణక్య ప్రకారం.. పురుషుల కంటే మహిళలు ఎనిమిది విషయాలలో చాలా నిగ్రహంగా ఉంటారు. సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తారు. అందుకే కుటుంబ పోషణలో వీరి పాత్ర పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది.

4. చాణక్య నీతి ప్రకారం.. పురుషుల కంటే మహిళలు ధైర్యవంతులు. వారు పురుషుల కంటే ఆరు రెట్లు ఎక్కువ ధైర్యం కలిగి ఉంటారని నిరూపణ అయింది. పురుషులతో పోలిస్తే వారు అన్నింటిలో ముందు వరుసలో ఉంటారని చాణక్య తెలిపారు.

US Plane Crash: ఇళ్ల మధ్య కుప్పకూలిన విమానం.. ఇద్దరు దుర్మరణం.. మరో ఇద్దరికి..

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఈవారం నామినేట్ అయిన సభ్యులు ఎవరెవరంటే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DrEOKm

0 Response to "చాణక్య నీతి: ఆ 4 విషయాలలో మహిళలు పురుషుల కంటే ముందుంటారు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel