
Sushmita Dev: టీఎంసీలో చేరి నెల కాకముందే ఎగువసభకు.. రాజ్యసభకు సుస్మిత దేవ్ నామినేట్

Trinamool Congress: మాజీ ఎంపీ సుస్మిత దేవ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ తీర్థం పుచ్చుకుని నెల రోజులు కూడా కాకముందే.. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎంపీ సుస్మిత దేవ్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తృణముల్ కాంగ్రెస్ మంగళవారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. సుస్మితా దేవ్‌ను పార్లమెంట్‌లోని ఎగువసభకు నామినేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మహిళా సాధికారత కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎల్లప్పుడూ కృషి చేస్తారని.. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండేలా చూస్తారని తెలిపింది. అప్పుడే సమాజం మరింత అభివృద్ధి సాధిస్తుందని టీఎంసీ ట్విటర్‌లో పేర్కొంది. టీఎంసీ ఎంపీగా ఉన్న మనాస్ రంజన్ భునియా రాజీనామా చేసి మమత కేబినెట్‌లో మంత్రిగా చేరారు. దీంతో ఈ స్థానం ఖాళీగా కాగా, ఇప్పుడు దానిని సుస్మితతో భర్తీ చేయాలని టీఎంసీ నిర్ణయంతీసుకుంది.
కాగా.. తనను రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల సుస్మిత దేవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె గతంలో అస్సాంలోని సిల్చార్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కొన్ని రోజుల క్రితం సుస్మిత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఆమెకు అస్సాం, త్రిపురలో పార్టీ బాధ్యతలను అప్పగించింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న సుస్మిత.. పార్టీ వీడటంతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read:
JEE Mains 2021 Result: జేఈఈ మెయిన్స్ ఫలితాలు మరికాసేపట్లో.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి..
PM Cares for Children: కరోనాతో అనాధలైన పిల్లలకు స్టైఫండ్ పెంచే యోచనలో కేంద్రప్రభుత్వం
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3hyp1kF
0 Response to "Sushmita Dev: టీఎంసీలో చేరి నెల కాకముందే ఎగువసభకు.. రాజ్యసభకు సుస్మిత దేవ్ నామినేట్"
Post a Comment