
Silver Price Today: గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర ఎంతంటే..!

Silver Price Today: బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండిపై భారీగానే తగ్గుముఖం పట్టింది. తాజాగా శుక్రవారం దేశీయంగా ప్రధాన ప్రాంతాలలో వెండి ధరలను పరిశీలిస్తే.. కిలో వెండిపై దాదాపు రూ.2వేలకుపైగా తగ్గుముఖ పట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.58,300 ఉండగా, చెన్నైలో రూ.63,000 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.58,300 ఉండగా, కోల్‌కతాలో రూ.58,300 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.58,300 ఉండగా, కేరళలో రూ.63,000 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,000 ఉండగా, విజయవాడలో రూ. 63,000 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి కారణాల వల్ల బంగారంతో పాటు వెండి ధరల్లో మార్పులు ఉంటున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.
ఇవీ కూడా చదవండి:
SBI Offers: మీరు ఎస్‌బీఐ డెబిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో శుభవార్త.. ఏంటంటే..!
Hero MotoCorp: భారత్‌లో భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్ బైక్‌ల ధరలు.. కొత్త ధరల వివరాలు ఇవే..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kTbNRs
0 Response to "Silver Price Today: గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర ఎంతంటే..!"
Post a Comment