
Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పెరిగిన సిల్వర్ ధరలు..తాజాగా ఎంత పెరిగిందంటే..

Silver Price Today: ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లు మాత్రం ఆగవు. ధర ఎంత పెరిగిన కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. బంగారంలాగే వెండి కూడా కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఇక మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా ధరలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. తాజాగా బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. వెండి ధర పెరిగింది. కిలోపై రూ.350 నుంచి 500 వరకు పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,250 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.60,250 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.64,400 ఉండగా, కోల్‌కతాలో రూ.60,250 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.60,250 ఉండగా, కేరళలో రూ.64,400 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,400 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.64,400 ఉండగా, విశాఖపట్నంలో రూ.64,400 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.
కాగా, బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇవీ కూడా చదవండి:
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్.. 10 గ్రాముల ధర ఎంతంటే..!
SBI Customers Alert: మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్ ఉన్నాయా..? వెంటనే డిలీట్ చేయండి: ఎస్‌బీఐ
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3m1QxZ7
0 Response to "Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పెరిగిన సిల్వర్ ధరలు..తాజాగా ఎంత పెరిగిందంటే.."
Post a Comment