
Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. దేశీయంగా భారీగా తగ్గిన సిల్వర్ రేట్లు..

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటూనే ఉంటాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో శుక్రవారంతోపాటు.. శనివారం కూడా వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.61,600లుగా ఉంది. కిలో వెండిపై తాజాగా రూ.1200 మేర తగ్గింది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ. 61,600 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,600 లుగా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.61,600 గా కొనసాగుతోంది.
Baca Juga
* కేరళలో కిలో వెండి ధర రూ.65,900గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలోనూ వెండి ధర రూ. 65,900 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.65,900 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు శనివారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
0 Response to "Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. దేశీయంగా భారీగా తగ్గిన సిల్వర్ రేట్లు.."
Post a Comment