-->
Silver Price Today: దేశీయంగా తగ్గిన వెండి ధరలు.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం పెరిగిన ధరలు..

Silver Price Today: దేశీయంగా తగ్గిన వెండి ధరలు.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం పెరిగిన ధరలు..

Silver Price Today

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో గురువారం పెరిగిన వెండి ధరలు.. తాజాగా తగ్గాయి. శుక్రవారం దేశంలో కిలో వెండి ధర రూ.62,800లుగా ఉంది. కిలో వెండిపై రూ.600మేర తగ్గింది. అయితే.. దక్షిణాది నగరాల్లో రూ.100 మేర ధర పెరిగింది. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ. 62,800 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,800లుగా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 67,800గా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.62,800 గా కొనసాగుతోంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.62,800 లుగా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.67,800గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,800 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలోనూ వెండి ధర రూ. 67,800 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 67,800 లుగా ఉంది.

కాగా.. ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:

Revanth Reddy: కేటీఆర్ ట్విట్.. క్షమాపణలు చెప్పిన రేవంత్ రెడ్డి.. చివరకు శశి ధరూర్ ఏమన్నారంటే..?

PM Modi Birthday: 20 రోజులపాటు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.. ఈ సారి అంత ప్రత్యేకం ఎందుకో తెలుసా..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kjexr8

Related Posts

0 Response to "Silver Price Today: దేశీయంగా తగ్గిన వెండి ధరలు.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం పెరిగిన ధరలు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel