-->
Shah Rukh Khan-Atlee: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో అట్లీ చేసే సినిమా టైటిల్ ఇదేనా..?

Shah Rukh Khan-Atlee: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో అట్లీ చేసే సినిమా టైటిల్ ఇదేనా..?

Atlee

Shah Rukh Khan-Atlee: వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు అట్లీ. అట్లీ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను దక్కించుకున్నాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా టాప్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమా చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. షారుఖ్ ఖాన్‌తో అట్లీ సినిమా చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో టాప్ హీరోగా ఉన్న షారుఖ్ ప్రస్తుతం.. వరస డిజాస్టర్స్ సినిమాలతో నెట్టుకోస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా పై షారుక్ అభిమానులంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ప్రస్తుతం షారుఖ్ పఠాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత షారుఖ్ అట్లీతో కలిసి సినిమా చేయనున్నాడు.

తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమాకు లయన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. అలాగే ఈ మూవీలో సౌత్ హీరోయిన్ తీసుకోవాలని భావిస్తున్నారట. షారుఖ్ సరసన నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతారను సెలక్ట్ చేసుకోవాలనుకుంటున్నారట. అట్లీ మొదటి సినిమా రాజా రాణి సినిమాలో నయన్ నటించింది. అలాగే ఇటీవల వచ్చిన బిగిల్‌లోను నయనతార హీరోయిన్‌గా చేసింది.  మరోవైపు బీటౌన్ లో దీపికా పేరు కూడా బలంగా వినిపిస్తుంది. బాలీవుడ్‌లోకి దీపికా ఓం శాంతి ఓం చిత్రం ద్వారా దర్శనమిచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు దీపికాకు మంచి పేరును తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత షారూక్, దీపికా.. చెన్నై ఎక్స్‌ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ మూడు సినిమాలు మంచి విజయాలను సాధించగా.. వీరిద్దరు లక్కీ పెయిర్‌గా మారిపోయారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Pic: ఈ ఫోటోలోని చిన్నారి చాలా ఫేమస్.. ఇప్పుడొక హీరోయిన్.. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్..

Gully Rowdy Pre Release Event: థియేటర్లలో సందడి చేయనున్న రౌడీ.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో..

Zee kutumbam awards: మొదలైన జీ కుటుంబం అవార్డుల సందడి.. మీ అభిమాన స్టార్స్‌కు ఇలా ఓటు వేయండి.

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3tShyBS

Related Posts

0 Response to "Shah Rukh Khan-Atlee: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో అట్లీ చేసే సినిమా టైటిల్ ఇదేనా..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel