-->
Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల.. టెన్షన్ లేదన్న వైద్యులు..

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల.. టెన్షన్ లేదన్న వైద్యులు..

Sai Dharam Tej3

Sai Dharam Tej Accident: రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ హెల్త్ కండీషన్‌పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరిగిందని, అది పెద్ద సమస్య కాదని తెలిపారు. ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. సాయిధరమ్ తేజ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఉదయం కల్లా మాట్లాడుతారని తెలిపారు. అయితే, ప్రస్తుతం వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామన్నారు. ప్రస్తుతానికి తేజ్ ఆరోగ్యంగా నిలకడగానే ఉందని తెలిపారు. తేజ్ తప్పనిసరిగా కోలుకుంటాడని, ఎవరూ టెన్షన్ పడొద్దని చెప్పారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి కింద‌ప‌డిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్‌కు గురవడం వల్ల షాక్‌లో అపస్మారకస్థితిలోకి వెళ్లారని, మరే ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు. కాగా, తేజ్ కుటుంబ సభ్యులందరూ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Also read:

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. ఇదిగో ఇలా స్కిడ్ అయ్యింది.. వీడియో ఫుటేజీ..

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తేలిందంటే?

Sai Dharam Tej Accident: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. క్షేమంగా బయటపడటానికి కారణమదే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3hoirgt

0 Response to "Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల.. టెన్షన్ లేదన్న వైద్యులు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel