-->
Sai Dharam Tej Accident Live Updates : సాయి ధరమ్ తేజ్‌ అవుట్ ఆఫ్ డేంజర్.. కొనసాగుతున్న చికిత్స ..

Sai Dharam Tej Accident Live Updates : సాయి ధరమ్ తేజ్‌ అవుట్ ఆఫ్ డేంజర్.. కొనసాగుతున్న చికిత్స ..

Sai

Sai Dharam Tej : మెగా హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సాయి ధరమ్ తేజ్ కు గాయాలవడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ప్రస్తుతం కోలుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఆసుపత్రికి చేరుకున్నారు.

తేజ్‌కు శుక్రవారం సాయంత్రం 7-30 ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగిందని .. ప్రస్తుతం కోలుకుంటున్నాడని మెగా ఫ్యామిలీ తరపున అల్లు అరవింద తెలిపారు. చికిత్స జరుగుతుందని.. అభిమానులు ఆందోళపడాల్సిన అవసరం లేదని అరవింద్ తెలిపారు.

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3hmSOg0

0 Response to "Sai Dharam Tej Accident Live Updates : సాయి ధరమ్ తేజ్‌ అవుట్ ఆఫ్ డేంజర్.. కొనసాగుతున్న చికిత్స .."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel