-->
Rakul Preet Singh: డ్రగ్స్ కేసు విచారణలో రకుల్‌కు 7 గంటలపాటు ఈడీ సంధించిన ప్రశ్నలు.. రాబట్టిన సమాధానాలు?

Rakul Preet Singh: డ్రగ్స్ కేసు విచారణలో రకుల్‌కు 7 గంటలపాటు ఈడీ సంధించిన ప్రశ్నలు.. రాబట్టిన సమాధానాలు?

Rakul Preet Singh

Rakul Preet Singh: క్వశ్చన్ టైమ్‌లో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించిందనేది సర్వత్రా ఇంట్రెస్టింగ్‌గా మారింది.  F-క్లబ్‌లో డ్రగ్ పార్టీలు జరిగాయా? ఆ క్లబ్‌ మేనేజర్‌కి డబ్బులు ఎందుకు పంపించారు? అసలు లావాదేవీల వెనుక లోగుట్టు ఏంటీ? వీటిపైనా హీరోయిన్‌ రకుల్‌కి ప్రశ్నాస్త్రాలు సంధించింది ఈడీ.  రేపు.. మాపు.. అన్న ట్విస్ట్‌ల మధ్య ఈడీ ఎదుట శుక్రవారం హాజరైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు ఏడు గంటలపాటు సాగిందీ విచారణ.

ప్రధానంగా రకుల్ బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ అధికారులు ఆరాతీశారు. F-క్లబ్‌ మేనేజర్‌కు చాలాసార్లు మనీ పంపినట్టు గుర్తించారు. అవి ఎందుకు పంపారు? దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. F-క్లబ్‌లో ఎలాంటి పార్టీలు జరిగేవి..? అందులో డ్రగ్స్ వాడారా..? పార్టీలకు ఎవరెవరు అటెండ్‌ అయ్యేవాళ్లు.. అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాటిపైనా ప్రశ్నాస్త్రాలు సంధించారు.

రకుల్ అకౌంట్ల నుంచి కెల్విన్‌కు సైతం మనీ ట్రాన్స్‌ఫర్ అయింది. వాటితో పాటు కొన్ని అనుమానిత లావాదేవీలను సైతం ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. వాటిపైనా ఆరా తీశారు. రకుల్‌తో పాటు.. ఆమె ఆడిటర్‌ను కలిపి విచారించారు. కేవలం బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్లే కాదు.. డ్రగ్ పెడ్లర్‌ కెల్విన్‌తో, F-క్లబ్ మేనేజర్లతో చాటింగ్ చేసిన వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం.

సరిగ్గా ఐదేళ్ల కిందట జరిగిన ఎఫ్‌ క్లబ్‌ పార్టీపై ఫోకస్‌ పెట్టారు ఈడీ అధికారులు. ఎఫ్‌ క్లబ్‌ పార్టీకి అటెండ్‌ కావడం రకుల్‌ మెడకు చుట్టుకుంది. అదే పార్టీలో చాలా మందికి డ్రగ్స్‌ సరఫరా చేశాడు కెల్విన్‌. ఎఫ్ క్లబ్‌ పార్టీ ఫుటేజ్‌ ఆధారంగా రకుల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు విచారణలో కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది.

ఎఫ్‌ క్లబ్‌ .. కెల్విన్‌ అడ్డా అని తేలిపోయింది. దీంతో ఎఫ్‌ క్లబ్‌ పార్టీ టాలీవుడ్‌లో ఇంకా ఎంత మంది మెడకు చుట్టుకుంటుందోననే దడ కొందరిలో మొదలైంది. ఎఫ్‌ క్లబ్‌.. డార్క్‌ వెబ్‌.. కెల్విన్‌.. నవదీప్‌.. ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈ పేర్లు ఇప్పుడు కీలకంగా మారాయి. కెల్విన్‌ విచారణలోనే కీలక విషయాలు బయటపడ్డాయి.

ఇప్పుడు రకుల్ ఎలాంటి వివరాలు ఈడీకి సమర్పించింది.. ఎవరెవరి పేర్లు బయటపెట్టిందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రకుల్ విచారణ ఆధారంగా మరికొందరికి ఈడీ నోటీసులిస్తారని తెలుస్తోంది.

Read also: Fake challan Scam: అన్ని శాఖల్లోనూ అవినీతి.. ఏపీని కుదిపేస్తోన్న నకిలీ చలాన్ల కుంభకోణం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3tcgJDz

0 Response to "Rakul Preet Singh: డ్రగ్స్ కేసు విచారణలో రకుల్‌కు 7 గంటలపాటు ఈడీ సంధించిన ప్రశ్నలు.. రాబట్టిన సమాధానాలు?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel