
Pralhad Joshi Dance: స్టేజ్ మీద స్టెప్పులేసి ఊదరగొట్టిన కేంద్రమంత్రి

Pralhad Joshi: పెళ్లి అంటేనే జోష్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక కేంద్రమంత్రి కూతురుని పెళ్లి వేరే లెవెలే. హై ప్రొఫైల్ పెళ్లిలో ఏం జరిగినా.. వింతే. అలాంటి చమక్కులు జరిగిన మరో పెళ్లి తాజాగా సాక్షాత్కారమైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి రిసెప్షన్‌కి బడా బడా రాజకీయ నాయకులు సందడి చేశారు.
కర్ణాటకలోని హుబ్లీ నగరంలో జరిగిన ఈ వివాహ విందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో పాటు పలు రంగాల ప్రముఖులు విచ్చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించి.. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ తన సతీమణితో కలిసి ఈ సందర్భంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన కుమార్తె వివాహ వేడుక హుబ్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన తన భార్యతో కలిసి ఓ కన్నడ పాత సినిమా పాటకు హుషారుగా స్టెప్పులు వేశారు. ఆయన డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఇంత భారీ స్థాయిలో పెళ్లి చేయడం.. ఇంతమందిని ఆహ్వానించడం అవసరమా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తె వివాహాన్ని తన రేంజ్‌కు తగ్గట్లు ప్లాన్ చేసుకున్నారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.
ಇಂದು ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ಜರುಗಿದ ನನ್ನ ಮಗಳ ಮದುವೆಗೆ ಆಗಮಿಸಿ ವಧು ವರರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದ ಕೇಂದ್ರ ಗೃಹ ಸಚಿವರಾದ ಶ್ರೀ @AmitShah ಅವರಿಗೆ ಜೋಶಿ ಕುಟುಂಬದ ಪರವಾಗಿ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು. pic.twitter.com/vJCyl6Tsdv
— Pralhad Joshi (@JoshiPralhad) September 2, 2021
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zIIJ3Z
0 Response to "Pralhad Joshi Dance: స్టేజ్ మీద స్టెప్పులేసి ఊదరగొట్టిన కేంద్రమంత్రి"
Post a Comment