-->
Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‏తో షూరు చేసిన బుట్టుబొమ్మ.. ఇకపై సొంత గళాన్ని వినిపించనున్న పూజా హెగ్డే..

Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‏తో షూరు చేసిన బుట్టుబొమ్మ.. ఇకపై సొంత గళాన్ని వినిపించనున్న పూజా హెగ్డే..

Pooja Hegde

పూజా హెగ్డే.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్స్‏లలో ఒకరు. ఇప్పుడు ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. తెలుగులోనే కాకుండా.. తమిళం, హిందీ భాషల్లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ అగ్ర స్థానంలో దూసుకుపోతుంది ఈ బుట్టబొమ్మ. దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో నటించింది. అలాగే అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచిలర్ సినిమాలోనూ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ.. మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా విడుద చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా పొస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు పూజా హెగ్డే ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఓ సినిమాలోనూ ఆమె తన గొంతుతో డబ్బింగ్ చెప్పలేదు. ఆమె పాత్రలకు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు. అయితే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు మాత్రం పూజా హెగ్డే మొదటి సారి డబ్బింగ్ చెప్పడం షూరు చేసింది. బుట్టబొమ్మ డబ్బింగ్ చెప్తున్న ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు తెలుగు భాషలో ఈ అమ్మడు చాలా చక్కగా మాట్లాడుతుందని.. అలాగే డబ్బింగ్ కూడా ఎంతో స్పష్టంగా చెబుతున్నట్లుగా సమాచారం. రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఆమె నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. రెండు భిన్న మనస్తత్వాలున్న ఇద్దరి ప్రేమాయణం.. ఎలా పెళ్లి పీటలవరకు వచ్చిందనేదే ఈ సినిమా అని మేకర్స్ తెలిపారు. ఇందులో ఆమని, మురళీశర్మ, జయప్రకాష్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Also Read:

Bigg Boss 5 Telugu: నీకు తగిన శాస్తి జరిగిందన్న ప్రియా.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్..

Priyuralu Movie Review: సామాజిక బాధ్యత… మనసులో ఇష్టం… మధ్యలో ‘ప్రియురాలు’



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zpVxv3

Related Posts

0 Response to "Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‏తో షూరు చేసిన బుట్టుబొమ్మ.. ఇకపై సొంత గళాన్ని వినిపించనున్న పూజా హెగ్డే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel