-->
Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌కు పవర్‌ స్టార్‌ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా.? ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌కు పవర్‌ స్టార్‌ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా.? ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

Powerstar Pawankalyan

Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌ ఈ పేరు ఓ బ్రాండ్‌, పవన్‌ పేరు వింటేనే అభిమానుల హృదయాలు ఉప్పొంగుతాయి. పవన్‌ నుంచి సినిమా వస్తుందంటే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌కు ఈతరం యంగ్‌ జనరేషన్‌ కూడా ఎంతగానో అభిమానిస్తుండడం విశేషం. సెప్టెంబర్‌ 2 వచ్చిందంటే చాలు పవన్‌ అభిమానులకు ఒక పండగా వచ్చినట్లే. పవన్‌ కళ్యాణ్ జన్మదినం నేడు (గురువారం).. ఈ రోజు పవన్‌ 50వ జన్మదినం కావడంతో సోషల్‌ మీడియాలో కోలాహలం నెలకొంది. పవన్‌ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు చేస్తూ తమ అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌కు అసలు పవర్‌ స్టార్‌ అనే బిరుదు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా.? అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ విషయాన్ని పవన్ పుట్టిన రోజు సందర్భంగా తెలుసుకుందాం.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన గోకులంలో సీత మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తర్వాత వచ్చిన ఈ సినిమా పవన్‌ కెరీర్‌లో తొలి విజయాన్ని అందించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి మాటలు అందించారు.

Pawan Kalyan

1997లో ఈ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న పోసాని.. పవన్‌ కళ్యాణ్‌ను పవర్‌ స్టార్‌ అంటూ సంబోధించారు. దీంతో అప్పటి నుంచి పవన్‌ కళ్యాణ్‌ను పవర్‌ స్టార్‌ అంటూ పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత పవన్‌ నటించి ‘సుస్వాగతం’ సినిమా నుంచి పవన్‌ పేరుకు ముందు పవర్ స్టార్‌ అని జోడించారు. ఇదండీ పవన్‌ కళ్యాణ్‌కు పవర్‌స్టార్‌ బిరుదు రావడానికి అసలైన కారణం. ఇదిలా ఉంటే కొన్ని రోజుల పాటు రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్‌ ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్‌ చేసి ఫ్యాన్స్‌లో జోష్‌ను పెంచిన విషయం తెలిసిందే.

Also Read: Mahesh Babu: సోషల్‌ మీడియాలో మరో అరుదైన ఘనత సాధించిన సూపర్‌ స్టార్‌.. ఎఫ్‌బీలో మహేష్‌ ఫాలోవర్లు ఎంతో తెలుసా?

Pawan Kalyan Birthday: ఒక రోజు ముందే సర్‌ప్రైజ్ చేసిన భీమ్లా నాయక్ టీమ్..

Nani: నా సినిమా బ్యాన్ చేస్తా అన్నవాళ్ళందరూ నా కుటుంబసభ్యులే.. నాని ఆసక్తికర కామెంట్స్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DEPPJj

Related Posts

0 Response to "Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌కు పవర్‌ స్టార్‌ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా.? ఆసక్తికరమైన విషయాలు మీకోసం."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel