
Mysterious Deaths: స్మశానవాటికలో అర్థరాత్రి ‘శవాల వర్షం’.. అది చూసి జనాలు హడలిపోయారు..!

Mysterious Deaths: ఇండోనేషియాలోని బాలిలో దారుణం చోటు చేసుకుంది. ఉన్నపళంగా వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. వందల సంఖ్యలో పక్షుల మృతదేహాలు కుప్పకూలాయి. అది చూసి జనాలు హడలిపోతున్నారు. పక్షుల ఈ స్థాయిలో చనిపోవడం వెనుక వాతావరణంలో మార్పులే కారణమని స్థానిక అధికార యంత్రాంగం భావిస్తోంది. కాగా, బాలిలోని స్మశాన వాటికలో చనిపోయిన పిచ్చుకల శవాలను చూసి పర్యాటకులు, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, కొందరు వ్యక్తులు ఈ పక్షుల మరణాలకు సంబంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
ది సన్ కథనం ప్రకారం.. బాలిలోని స్మశానసవాటికలో నల్లట వస్తువులు పరిచినట్లుగా పడి ఉన్నాయి. ఏంటా అని కొంచెం దగ్గరగా వెళ్లి చూస్తే.. అవన్నీ పక్షుల శవాలు. పిచ్చుకలన్నీ చనిపోయిన పడి ఉన్నాయి. వందల సంఖ్యలో గుట్టలుగా, పరిచినట్లుగా పడి ఉన్నాయి. మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరుగలేదని, రాత్రికి రాత్రే ఇన్ని పక్షులు చనిపోవడంతో ఆందోళనకరంగా ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ఇదిలాఉంటే.. పిచ్చుకల మృతికి వాతావరణంలో మార్పు లేదా ఆమ్ల వర్షం కారణం అయి ఉండొచ్చని స్థానిక అధికార యంత్రాంగం చెబుతోంది. జియానార్ రీజెన్సీలోని జంతు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి మెడ్ శాంటియార్కా, వాతావరణం కారణంగా ఇది జరిగి ఉండవచ్చని చెప్పారు. కానీ మరుసటి ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. పురుగుల మందు కారణంగా వందలాది పిచ్చుకలు చనిపోయాయని నిర్ధారణకు వచ్చారు. దీనిపై ఇంకా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Also read:
International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అగ్నిప్రమాదం.. భారీగా కమ్ముకున్న పొగ..!
Viral News: బాప్‌రే ఇలా చేసిందేంటి?.. టీవీలో కనిపించిన ఆనందంలో ఓ మహిళ ఏకంగా..!
Bullet Vinayakudu: ట్రెండ్ ఫాలో అవుతున్న గణనాథుడు.. కొత్తలుక్‌లో అందరినీ కట్టిపడేస్తున్నాడు..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3z4aTFq
0 Response to "Mysterious Deaths: స్మశానవాటికలో అర్థరాత్రి ‘శవాల వర్షం’.. అది చూసి జనాలు హడలిపోయారు..!"
Post a Comment