-->
Mahesh Babu: మహేష్‌ బాబు అంత ఎనర్జీగా ఉండడానికి కారణమేంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..

Mahesh Babu: మహేష్‌ బాబు అంత ఎనర్జీగా ఉండడానికి కారణమేంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..

Maheshbabu

Mahesh Babu: టాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరో మహేష్‌ బాబు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతోన్నా ఇప్పటికీ మహిళల రాకుమారుడిగా కొనసాగుతున్నారు. సినిమా సినిమాకు తన అందాన్ని పెంచుకోవడమే కాకుండా ఎనర్జీని కూడా పెంచుకుంటూ పోతున్నారు మహేష్‌. తాజాగా ఇదే విషయాన్ని ఓ విలేకరి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు సూపర్ స్టార్‌.

మహేష్‌ బాబు తాజాగా బిగ్‌సీ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన తొలి హీరోగా మహేష్‌ నిలిచారు. ఈ క్రమంలోనే మహేష్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులైన నేపథ్యంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు మహేష్‌ తనదైన శైలిలో స్పందించారు.

మీరు ఇంత ఎనర్జీగా ఉండడానికి కారణమేంటి.? అని అడిగిన ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. బహుశా అదే నా ఎనర్జీకి కారణమై ఉంటుంది. అలాగే జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటాను. ఏ విషయాన్నైనా పెద్దగా ఆలోచించను. అదే నా ఎనర్జీ సీక్రెట్‌’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళితో సినిమా చేయడం తన కల అని అది త్వరలోనే నిజమవుతోందని తెలిపారు. ఇక మహేష్‌ తన కెరీర్‌లో నటించిన సినిమాల్లో అన్నింటి కంటే పోకిరి తనకు ఇష్టమైన సినిమా అని అన్నారు.

ప్రస్తుతం నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ చిత్రం పోకిరికి ఏమాత్రం తగ్గదు అని చెప్పుకొచ్చారు. ఇక మీరు వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశాలున్నాయా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘వెబ్‌ సిరీస్‌ చూడడం మాత్రమే కానీ చేయడం అనే ఆలోచన ఇంత వరకు రాలేదు, కానీ ఎవరికీ తెలుసు.? వెబ్‌ సిరీస్‌లు కూడా మంచి ఐడియాలతో వస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు నాకు అలాంటి ఆలోచనలు లేవు’ అని క్లారిటీ ఇచ్చారు.

Also Read: Manchu Vishnu: ‘చంద్రబాబు గారు బంధువు.. జగన్ బావగారు’.. దయచేసి అలా లాగకండి

Tollywood Drugs Case: ఏంటీ మిస్టరీలు..? ఒకరేమో పత్తాలేకుండా పోయారు.. మరొకరు కోర్టుకు రారు

Tollywood Heroine: ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్… వరుణ్ తేజ్ మూవీలో నటించింది.. గుర్తించారా



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ETcLVF

Related Posts

0 Response to "Mahesh Babu: మహేష్‌ బాబు అంత ఎనర్జీగా ఉండడానికి కారణమేంటో తెలుసా.? ఆయన మాటల్లోనే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel