-->
Love Story: నాగచైతన్య ‘లవ్‌ స్టోరీ’ విషాదాంతంగా ముగుస్తుందా.? శేఖర్‌ కమ్ముల ఏం చేయనున్నాడో తెలియాలంటే..

Love Story: నాగచైతన్య ‘లవ్‌ స్టోరీ’ విషాదాంతంగా ముగుస్తుందా.? శేఖర్‌ కమ్ముల ఏం చేయనున్నాడో తెలియాలంటే..

Love Story

Love Story: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్‌ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. సమాజంలో ఇప్పటికీ ఉన్న కులం అనే జాడ్యాన్ని అంశంగా తీసుకొని శేఖర్‌ ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరు వేరు, వేరు కులాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం.. దానికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం ఈ కథాంశంతో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అయితే శేఖర్‌ కమ్ముల ఈ కథను ఎలా చూపించనున్నాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పెద్దలను ఎదురించిన ఆ జంట ఏం చేసిందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా సెప్టెంబర్‌ 24 (శుక్రవారం) విడుదలవుతోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ తర్వాత ఓ సినిమాకు ఈ స్థాయిలో బజ్‌ ఏర్పడడం ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గరపడుతోన్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్‌ చేస్తోంది. ఈ సినిమా కోసం శేఖర్‌ రెండు రకాల క్లైమాక్స్‌లను తెరకెక్కించారనేది ఆ వార్త సారాంశం.

ఒక క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్‌తో కూడినదైతే మరో క్లైమాక్స్ విషాదాంతమని తెలుస్తోంది. అయితే తెరపై ఏ క్లైమాక్స్‌ను చూపించనున్నారో మాత్రం దర్శకుడు సీక్రెట్‌గా ఉంచారని సమాచారం. చివరికి మూవీ యూనిట్‌కు కూడా శేఖర్‌ ఈ విషయం చెప్పలేదంటా.? మరి తన సినిమాల ద్వారా సమాజానికి మంచి మెసేజ్‌ ఇచ్చే శేఖర్‌ ఈసారి ఏం చేస్తారో తెలియాంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Also Read: Nandamuri Balakrishna : లైగర్ టీమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన లయన్.. నట సింహం ఎంట్రీతో సెట్‌లో సందడి..

Sharwanand: ఆ స్టార్ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో సినిమా చేయనున్న యంగ్ హీరో శర్వానంద్..

Venkatesh-Rana: ఓటీటీలోకి అడుగు పెడుతున్న దగ్గుబాటి హీరోలు.. రానా- వెంకటేష్ వెబ్ సిరీస్‌కు పవర్ ఫుల్ టైటిల్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lJ8Ge4

0 Response to "Love Story: నాగచైతన్య ‘లవ్‌ స్టోరీ’ విషాదాంతంగా ముగుస్తుందా.? శేఖర్‌ కమ్ముల ఏం చేయనున్నాడో తెలియాలంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel