-->
KTR: సొంత పార్టీ ఎంపీ, కీలక నేతపై రేవంత్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్.. ఆడియో క్లిప్‌ను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే..

KTR: సొంత పార్టీ ఎంపీ, కీలక నేతపై రేవంత్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్.. ఆడియో క్లిప్‌ను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే..

Ktr Tweeted Revanth Reddy Audio Clip

Revanth Reddy Audio Clip: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. తాజాగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఆడియోను ట్వీట్ చేసి.. కాంగ్రెస్ నాయకులకు షాకిచ్చారు. ఈ ఆడియోలో రేవంత్ రెడ్డి కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను విమర్శించినట్టుగా ఉంది. కేటీఆర్, శశిథరూర్ ఒకటే అని రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఈ ఆడియోలో వినిపిస్తోంది. అయితే.. శశిథరూర్ లాంటి వాళ్లను పార్టీ నుంచి బహిష్కరించాలని రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్టుగా ఉంది. ఓ జాతీయ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ఈ రకంగా సమాధానం ఇచ్చినట్టు ఆడియోలో ఉంది.

అయితే.. ఈ ఆడియోను ట్వీట్టర్ లో పంచుకున్న మంత్రి కేటీఆర్.. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. శశిథరూర్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను తనకు ఓ రిపోర్టర్ పంపించారంటూ పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే.. ఇది ఓటుకు నోటు ఆడియోలోని రేవంత్ రెడ్డి వాయిస్‌తో మ్యాచ్ అవుతుందంటూ కేటీఆర్ ట్విట్ చేశారు. ఈ ఆడియోపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తారా..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

అయితే దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్ ద్వారా వివరణ ఇచ్చారు. పుట్టుకతోనే అబద్ధాలకోరు అయిన కేటీఆర్ శశిథరూర్, ఫేక్ న్యూస్ వెనుక దాక్కోలేడని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పరిణామాలు, తన కుటుంబంపై అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అంతకుముందు కేటీఆర్.. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథరూర్‌ను రేవంత్ గాడిద‌తో పోల్చిన ఓ ఇంగ్లీష్ పేపర్ న్యూస్ క్లిప్‌ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. చీటర్‌కు పార్టీ సార‌థ్య బాధ్యతలు అప్పగిస్తే ఇలానే ఉంటుంద‌ంటూ కేటీఆర్ విమర్శించారు. ఇటీవ‌ల ఐటీ స్టాండింగ్ క‌మిటీ చైర్మన్ శ‌శి థ‌రూర్ త‌న బృందంతో హైద‌రాబాద్‌లో పర్యటించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ పర్యటనపై.. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ పర్యటనపై రిపోర్టర్ రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించగా.. రేవంత్ ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది.

Also Read:

Saidabad Incident: సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడు రాజు అంత్యక్రియలు.. భారీ బందోబస్తు మధ్య పూర్తి

YS Sharmila: చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడు.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nKJ7fr

0 Response to "KTR: సొంత పార్టీ ఎంపీ, కీలక నేతపై రేవంత్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్.. ఆడియో క్లిప్‌ను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel