-->
JEE Mains 2021 Result: జేఈఈ మెయిన్స్ ఫలితాలు మరికాసేపట్లో.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి..

JEE Mains 2021 Result: జేఈఈ మెయిన్స్ ఫలితాలు మరికాసేపట్లో.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి..

Nta Jee Main 2021 Session 4

NTA JEE Main 2021 session 4: ఐఐటీల్లో బీఈ, బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు జేఈఈ నాలుగో విడుత పర్సంటైల్‌తోపాటు తుది ర్యాంకులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించనుంది. దీంతోపాటు కటాఫ్‌ మార్కులను కూడా విడుదల చేస్తుంది. విద్యార్థులు ర్యాంకుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in, DigiLocker లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
దీనిలో ప్రధాన ఫలితం, NTA స్కోర్ కార్డ్ కూడా అందుబాటులో ఉంటుంది.
పరీక్ష నాల్గవ సెషన్‌ను ఎంచుకొని.. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే ఫలితం కనిపిస్తుంది.
అనంతరం స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి.

ఇదిలావుంటే.. ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే JEE అడ్వాన్స్‌డ్‌ 2021 పరీక్షకు ద‌ర‌ఖాస్తు ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 11) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. JEE మెయిన్‌ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కావడంతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేశారు.

Also Read:

Assam Rifles Recruitment: అస్సాం రైఫిల్స్‌లో 1230 పోస్టులు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే.

PM Cares for Children: కరోనాతో అనాధలైన పిల్లలకు స్టైఫండ్ పెంచే యోచనలో కేంద్రప్రభుత్వం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Esexgu

0 Response to "JEE Mains 2021 Result: జేఈఈ మెయిన్స్ ఫలితాలు మరికాసేపట్లో.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel