-->
Hyderabad: పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఆకతాయిల చేష్టలు మితిమీరుతున్నాయి.. సీటీలో మరో ఘటన

Hyderabad: పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఆకతాయిల చేష్టలు మితిమీరుతున్నాయి.. సీటీలో మరో ఘటన

2

Hyderabad – Rajeev Nagar: పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఆకతాయిల చేష్టలు మితిమీరుతున్నాయి. పదేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడికి దేహశుద్ధి చేశారు స్థానికులు. చెట్టుకు కట్టేసి యువకుడి తాటతీశారు. సైదాబాద్‌ హత్యాచారం మరువక ముందే అదే తరహా ఘటనలు రిపీట్‌ అవుతున్నాయి.. తాజాగా రాజీవ్‌గాంధీనగర్‌లో ఓ యువకుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పదేళ్ల బాలిక ఇంటి ముందు సైకిల్‌పై వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.

బాలిక దగ్గరగా వచ్చిన యువకుడు ముద్దు పెట్టుకొనేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన బాలిక గట్టిగా కేకలేసింది. బాలిక అరుపులు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యువకుడి రెండు చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. తర్వాత ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సదరు వ్యక్తిని 21 ఏళ్ల రహమాన్‌గా గుర్తించారు. తాగిన మైకంలో ఇలా చేశానంటూ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు యువకుడు. ఈ ఘటన ఆగస్టు 31న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు గతంలోనూ ఇదే అసభ్యంగా ప్రవర్తించినట్టు బాలిక చెబుతోంది.

1

1

Read also: Fish Ponds: విశాఖ జిల్లాలోని అనధికార రొయ్యల చెరువులపై రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల దాడులు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3k9D81m

0 Response to "Hyderabad: పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఆకతాయిల చేష్టలు మితిమీరుతున్నాయి.. సీటీలో మరో ఘటన"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel