
Janasena: జనసేన నాయకుడి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. అసలేం జరిగిందంటే..!

Janasena: కృష్ణాజిల్లా పెడనలో జనసేన నాయకుడి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అయిన యడ్లపల్లి రామ్ సుధీర్ కారును దుండగులు ధ్వంసం చేశారు. పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పెడన పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న హోటల్‌లో రామ్ సుధీర్ బస చేస్తుండగా.. బయట నిలిపి ఉంచిన కారు అద్దాలను రాళ్లతో పగలకొట్టారు ఆగంతకులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇదిలాఉండగా, ఏపీ రాజకీయాల్లో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్. తాజాగా జరుగుతోన్న మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో పాత మిత్రులు కలిశారు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య అవగాహన కుదిరింది. దీంతో ఆచంట, వీరవాసరం MPPలు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు ఎవరికి వాళ్లే పోటీచేశారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చింది. దీంతో ఆచంటలో MPPని తెలుగుదేశం గెల్చుకుంది. ఇక్కడ టీడీపీ-7, జనసేన- 4, వైసీపీ 6 చోట్ల విజయం సాధించాయి. జనసేన మద్దతుతో MPP టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. జనసేనకు వైస్ ఎంపీపీ, కోఆప్షన్ పదవులు దక్కాయి.
ఇక, వీరవాసరంలో ఆసక్తికర రాజకీయం జరిగింది. అతి తక్కువ సీట్లు గెలిచిన TDPకి MPP దక్కింది. ఇక్కడ జనసేన-8, టీడీపీ-4 చోట్ల గెలుపొందాయి. వైసీపీ 7 చోట్ల విజయం సాధించింది. అయితే ఇక్కడ కూడా జనసేన మద్దతుతో టీడీపీకి చెందిన వీరవల్లి దుర్గాభవాని పరిషత్ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఎక్కువ సీట్లు గెల్చినప్పటికీ టీడీపీకే MPP ఇవ్వడంపై జనసేన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
Read also: TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లో గుబులు రేపుతోన్న కొత్త ఎండీ బాజిరెడ్డి కామెంట్లు.!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lQwooM
0 Response to "Janasena: జనసేన నాయకుడి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. అసలేం జరిగిందంటే..!"
Post a Comment