
IPL 2021: రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం.. ప్లేఆఫ్‌కు మరింత చేరువగా..

IPL 2021: ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్టు మరో విజయాన్ని అందుకుంది. దుబాయ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగలూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గెలన్ మ్యాక్స్‌వెల్ (50) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. శ్రీకర్ భరత్ (44) చక్కటి సహకారం అందించగా, వీరిద్దరు కలిసి ఆర్‌సీబీ జట్టును ప్లేఆఫ్‌కు చేరువ చేశారు.
రాజస్థాన్ బౌలర్లలో ముస్తఫిజ్జుర్ రహమాన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్ నిర్ణిత 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కాగా, టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు లూయిస్, జైస్వాల్ జట్టుకు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 77 పరుగులు చేశారు. ఈ క్రమంలో డేనియల్ క్రిస్టియన్ వేసిన 8.2 బంతికి జైస్వాల్(31; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు).. సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. జార్జ్ గార్టన్ వేసిన 12వ ఓవర్‌లో ఎవిన్ లూయిస్(58; 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) శ్రీకర్ భరత్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ (19) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
RR vs RCB, IPL 2021: చివర్లో తడబడిన రాజస్థాన్.. బెంగుళూర్ లక్ష్యం 150 పరుగులు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3uvsllF
0 Response to "IPL 2021: రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం.. ప్లేఆఫ్‌కు మరింత చేరువగా.."
Post a Comment