-->
Important Tasks: ఈ మూడు పనులను సెప్టెంబర్‌ 30లోగా పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది..!

Important Tasks: ఈ మూడు పనులను సెప్టెంబర్‌ 30లోగా పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది..!

September

Important Tasks: కొన్ని కొన్ని ముఖ్యమైన పనులను చేసుకోవాలంటే ఇచ్చిన గడువులోగా పూర్తి చేసుకోవడం బెటర్‌. లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా, బ్యాంకింగ్‌ రంగలో ఆర్థికపరమైన విషయాలలో పూర్తి కాని పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఇక సెప్టెంబర్‌ నెల పదిహేను రోజులు గడిచిపోయింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సెప్టెంబర్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్‌ సామాన్యులను ఎక్కువగా ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఆధార్ పాన్ లింకింగ్, కేవైసీ అప్‍డేట్ లాంటి వాటికి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు గడువు ఉంది. ఈ గడువులోగా ఈ పని పూర్తి చేసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ నిబంధనలు ఎంతో ముఖ్యం. మరి ఆ నిబంధనలు ఏమిటో చూద్దాం.

ఆధార్‌- పాన్‌ అనుసంధానం: పాన్ కార్డుదారులు తమ ఆధార్‌ నెంబర్‌ను పాన్‌తో లింక్‌ చేసేందుకు సెప్టెంబర్‌ 30వ తేదీ గడువు ఉంది. పాన్ కార్డు, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ పలుమార్లు గడువు పొడిగించింది. సెప్టెంబర్ 30 లోగా పాన్, ఆధార్ లింక్ చేయాలని సూచించింది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ లింక్‌ చేయనివారుంటే ఈ నెలాఖరులోగా పూర్తి చేసుకోవడం బెటర్‌.

అలాగే ఆదాయపు పన్ను శాఖ 139ఏఏ ప్రకారం 2017 జూలై 1 నాటికి పాన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకోవాలి. తమ ఆధార్ నెంబర్‌ను పాన్ నెంబర్‌కు లింక్ చేయాలి. లేకపోతే పాన్ కార్డ్ చెల్లనిదిగా మారిపోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ఈనెలాఖరులోగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

డీమ్యాట్‌ అకౌంట్‌కు పాన్‌ లింక్‌: మీకు డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్లయితే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మీ కేవైసీ వివరాలు సెప్టెంబర్ 30 లోగా అప్‌డేట్ చేయాలి. లేకపోతే మీ డీమ్యాట్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది.

సెప్టెంబర్ 30వ తేదీలోగా బ్యాంకులో మీ మొబైల్‌ నెంబర్‌ను అప్‌డెట్‌ చేసుకోవాలి. ఆటో డెబిట్ కోసం టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 1న ప్రారంభం కానుంది. సాధారణంగా ఆటో డెబిట్ మ్యాండేట్ మ్యూచువల్ ఫండ్స్ సిప్స్ కోసం ఇస్తుంటారు. ఇకపై కస్టమర్లకు ఐదు రోజుల ముందు సమాచారం వస్తుంది. ఇలాంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటూ పెండింగ్‌ పనులను పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు.

కాగా, ఇలాంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోవడం బెటర్‌. ఇలాంటి ఆర్థికపరమైన విషయాలలో బ్యాంకులు, ప్రభుత్వాలు కూడా గడువు పెంచుతూ వస్తున్నాయి. కానీ ఒక సమయంలో ఇలాంటి విషయాలలో గడువు పెంచకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వస్తుంది. ముందు జాగ్రత్తగా వహించి పనులను పూర్తి చేసుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి: UPI Payment: ఆర్బీఐ మరో కీలక నిర్ణయం.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్‌ సర్వీసులు.. !

Bank Account: ఈ బ్యాంకులో ఖాతా తెరిస్తే ఉచిత క్రెడిట్‌ కార్డు.. రూ.30 లక్షల ప్రయోజనాలు.. ఇంకా మరెన్నో..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lvm1qk

Related Posts

0 Response to "Important Tasks: ఈ మూడు పనులను సెప్టెంబర్‌ 30లోగా పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel