
Hyderabad: అమ్మాయిల వెంట పడుతోన్న ప్రబుద్ధులకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్.. మరోసారి రిపీట్ అయితే..

Hyderabad: చట్టాలు ఎంత కఠినంగా అమలువుతున్నా.. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొందరు ప్రబుద్ధుల తీరు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా అమ్మాయిల వెంటపడే పోకిరీలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. టీషీమ్స్, నిర్భయ చట్టాలు వంటివి ఉన్నా తీరు మాత్రం మారడం లేదు. మహిళలపై తప్పుడుగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కొందరు యువకులు ఫలక్‌నుమా బాలిక జూనియర్, డిగ్రీ కళాశాల, పాఠశాల వద్ద అమ్మాయిలను ఏడిపిస్తున్నారు. కళాశాలకు వచ్చి పోయే సమయాల్లో కొందరు పోకిరీలు అమ్మాయిల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఛత్రినాక పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే గట్టి నిఘా పెట్టి ఛత్రినాక పోలీసులు గురువారం 11 మంది యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారికి ఇన్‌స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంకోసారి కళాశాల దరిదాపుల్లో కనిపిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి యువకులను వదిలేశారు.
Also Read: Gangrape: అమానుషం.. అంతకుమించిన ఘోరం.. మహారాష్ట్రలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై 29 మంది గ్యాంగ్‌రేప్..
Drugs Case: అఫ్ఘాన్ టూ ఆంధ్రా వయా ఇరాన్, గుజరాత్.. అంతర్జాతీయ డ్రగ్స్ దందాలో తెలుగు లింక్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3u8oaMD
0 Response to "Hyderabad: అమ్మాయిల వెంట పడుతోన్న ప్రబుద్ధులకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్.. మరోసారి రిపీట్ అయితే.."
Post a Comment