-->
Hyderabad: 9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా… 20 ఏళ్ల జైలు శిక్ష

Hyderabad: 9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా… 20 ఏళ్ల జైలు శిక్ష

Crime News

ప్రస్తుతం రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు తీవ్ర ప్రకంపనలు రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా సైదాబాద్​లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. నిందితుడు రాజు ఆత్మహత్య  చేసుకోవడంతో పౌర సమాజం శాంతించింది. అయితే నాలుగేళ్ల కింద జరిగిన ఓ విభిన్నమైన ఘటనలో కోర్టు తీర్పు వెలువరించింది. ఓ బాలుడ్ని లైంగికంగా వేధించిన ఆయాకు కోర్టు శిక్ష విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్​ పాతబస్తీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలుడిని లైంగికంగా వేధించిన ఆయాకు ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. బార్కాస్‌ ఏరియాలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో జ్యోతి అనే పాతికేళ్ల మహిళ.. 2017లో ఆయాగా చేరింది. ఆ ఏడాది నవంబర్ 20న బాధిత బాలుడు టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో ఆ వెనుకే వెళ్లిన జ్యోతి… బాలుడి మర్మాంగాలను పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టింది. మళ్లీ అదే నెల 30న కూడా జ్యోతి అలాగే ప్రవర్తించి బాలున్ని వేధించింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బాలుని ఒంటిపై సిగరెట్​తో కాల్చింది. శరీరంపై సిగరెట్ వాతను గమనించిన తండ్రి ఏమి జరిగిందని గట్టిగా అడగడంతో… బాలుడు ఏడుస్తూ జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో ఆయాపై బాలుడి తండ్రి 2017 డిసెంబర్‌లో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోక్సో కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. న్యాయస్థానంలో సాక్ష్యాధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన కోర్టు.. నాలుగేళ్ల విచారణ అనంతరం ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ… తీర్పు వెలువరించింది.

Also Read:  ఈ రాశి వారికి కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి.. అవసరమైన డబ్బులు అందుతాయి

 పరారీలో ఉన్న పబ్బుల ఓనర్ మురళి లొంగుబాటు.. హత్యాయత్నం కేసులో.. 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lw2wxQ

Related Posts

0 Response to "Hyderabad: 9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా… 20 ఏళ్ల జైలు శిక్ష"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel