-->
Horoscope Today: ఈరోజు ఈ రాశివారు నూతన గృహనిర్మాణం చేపడతారు, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు నూతన గృహనిర్మాణం చేపడతారు, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today

Horoscope Today(September 23rd 2021): ఆధునిక కాలంలో కూడా మంచి చెడులను మనిషి నమ్ముతున్నాడు. ముఖ్యంగా కొత్తగా ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో (సెప్టెంబర్ 23)  ఈరోజు గురువారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారికి  ఆర్ధిక పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్దాన చలన సూచనలున్నాయి.   అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి.

వృషభ రాశి: ఈ రాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొత్త వస్తవులను, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు చేపట్టిన పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.   స్వల్ప అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారికి  కొత్తపనులకు అనుకూల సమయం. చేపట్టిన కార్యక్రమాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. అప్పులు తీరుస్తారు.

సింహ రాశి: ఈ రాశివారు ఈరోజు నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం ఉంది. కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనారోగ్యం బారినపడి.. ఇబ్బందులు పడతారు. మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

తులా రాశి: ఈ రాశివారికి స్త్రీ వలన లాభాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.  ఆకస్మిక ధన లాభం ఉంది. సన్నిహితులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చిక రాశి: ఈ రాశివారు తీసుకునే నిర్ణయాలు అద్భుత ఫలితాను ఇస్తాయి.శుభవార్తలు వింటారు.  ఆత్మీయుల సహాయ, సహకారాలు ఉంటాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

ధనుస్సు రాశి: ఈ రాశివారికి ఈరోజు ధర్మకార్యాలు చేపడతారు. దైవ దర్శనం చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి.  శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. అనుకోని విధంగా ధనలాభం ఉంది.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది.  చేపట్టిన పనులు నెరవేరతాయి. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి: ఈరాశి వారికి ఈరోజు స్థిరాస్తుల విషయంలో సమయస్ఫూర్తి అవసరం. తగిన జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తం నిరుత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.

మీన రాశి:ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.  అప్రదిష్ట పాలయ్యే అవకాశం ఉంది.

Also Read:

భారీగా పెరిగిన బంగారం ధర.. అదే బాటలో పయనిస్తున్న వెండి.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

 తెలియక చేసినా.. పాపం ఎన్ని జన్మలైనా వెంటాడుతుంది.. రాజు దానం చేసే సమయంలో దోషం అంటకుండా ఎలా ఉండాలంటే



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EHLcyA

0 Response to "Horoscope Today: ఈరోజు ఈ రాశివారు నూతన గృహనిర్మాణం చేపడతారు, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel