
Guntur: అడ్డదారిలో ఇంజనీరింగ్ విద్యార్థులు.. జల్సాలకు అలవాటు పడి డ్రగ్స్ విక్రయాలు.. చివరకు..

B tech students arrest: వారంతా ఇంజనీరింగ్ చదువుతున్నారు.. అడ్డదారిలో సంపాదించాలనే ఉద్దేశ్యంతో డ్రగ్స్ విక్రయాలను మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు అర్బన్ పరిధిలో నిషేధిత సింథటిక్ డ్రగ్స్‌ను పెదకాకాని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ముగ్గురు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గుంటూరు శివారు గడ్డిపాడు ఇన్నర్‌రింగ్‌రోడ్డు పోలీసులు నిర్వహించిన సోదాల్లో సింథటిక్ డ్రగ్స్ పట్టుబడ్డాయని పేర్కొన్నారు. గుంటూరు ఇప్పటి వరకు ఇలాంటి డ్రగ్స్ బయటపడలేదని వెల్లడించారు.
బీటెక్ చదువుతున్న ముగ్గురు నిందితుల నుంచి 25 ట్రమడాల్ మాత్రలు, 25 గ్రాముల ఎల్.ఎస్.డి వ్రాపర్స్, 7 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. దీంతోపాటు రూ.24,500 నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పట్టుబడిన ముగ్గురు విద్యార్థులు కూడా టెలిగ్రామ్ ఆన్‌లైన్ ద్వారా సింథటిక్ మత్తు మందు తెప్పించుకుని విక్రయిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. అయితే.. వీరి వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది.. డ్రగ్స్ ను ఎలా సరఫరా చేస్తున్నారు అనే విషయాలపై విచారణ జరగాల్సి ఉందని ఆయన తెలిపారు.
Also Read:
JEE Main 2021 Result: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. మొదటి ర్యాంకులతో మెరిసిన తెలుగు విద్యార్థులు..
KTR: సైదాబాద్ నిందితుడు దొరకలేదు.. ఆ ట్వీట్ పొరపాటున చేశా: మంత్రి కేటీఆర్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zcuzr1
0 Response to "Guntur: అడ్డదారిలో ఇంజనీరింగ్ విద్యార్థులు.. జల్సాలకు అలవాటు పడి డ్రగ్స్ విక్రయాలు.. చివరకు.."
Post a Comment