-->
Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్‌లో కొత్త స్టైల్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో 495 గ్రాముల బంగారం పట్టివేత..

Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్‌లో కొత్త స్టైల్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో 495 గ్రాముల బంగారం పట్టివేత..

Gold Smuggling

దుబాయ్‌, సౌదీ అరేబియా, జాంబియా.. ఇలా వివిధ దేశాల నుంచి అక్రమంగా బంగారంను భారత్‌కు తరలిస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టులోనే దొరికిపోతున్నారు. తాజాగా మరోసారిగా బంగారం పట్టుబడింది. హైదారాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ఎంత పగడ్భంధీగా తనిఖీలు చేసినా అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా దుబాయ్‌ నుంచి బంగారం తీసుకొస్తూ.. ఓ వ్యక్తి శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. 24 లక్షల విలువైన 495 గ్రాముల బంగారాన్ని.. చెప్పులు, ఫేస్‌ క్రీము, హెయిర్‌ స్ట్రయిట్‌నర్‌లో దాచుకుని తెచ్చాడు. కానీ పక్కా సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని…. బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా.. గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త ఐడియాలతో కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు. దీంతో గోల్డ్ స్మగ్లింగ్.. అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎయిర్‌పోర్ట్‌లో మొన్నామధ్య ఓ వ్యక్తి తన చెప్పుల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. కొద్దిరోజుల కిందట ఓ మహిళ గర్భవతిగా నటిస్తూ మూడు కిలోల బంగారం దాచే ప్రయత్నం చేసింది. అధికారుల అప్రమత్తతో గోల్డ్ గుట్టు రట్టవుతూనే ఉంది. కానీ రవాణా మాత్రం రన్‌ రాజా రన్ అంటూ నాన్‌స్టాప్‌గా సాగుతూనే ఉంది.

తెలివిమీరిన స్మగ్లర్లు ఒంటికి బంగారం పూత పూసుకుని.. దెబ్బ తాకిందని బ్యాండేజ్‌తో కవరింగ్ ఇస్తున్నారు. మరికొందరు పౌడర్ రూపంలో రవాణా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల తనిఖీల్లో ఒక్కోసారి బంగారం పట్టుబడకపోయినా స్కానర్లు మాత్రం సైరన్ మోగిస్తున్నాయి. అయితే బంగారం ఎక్కడ దాచారన్నది గుర్తించేందుకు అధికారులకు పరీక్షగానే మారుతోంది.

ఇవి కూడా చదవండి: Drones: అడవుల పెంపకం కోసం నయా ప్లాన్.. డ్రోన్ల సహాయంతో బృహత్తర కార్యక్రమం..

Dumba Goat Farm: ఈ గొర్రెల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్నారు.. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం.. పెంపకం ఎలానో తెలుసుకోండి..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mWerat

0 Response to "Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్‌లో కొత్త స్టైల్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో 495 గ్రాముల బంగారం పట్టివేత.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel