
Drug Case: డ్రగ్స్ దందాలో సింగం నటుడు అరెస్టు.. భారీగా మత్తు పదార్థాల స్వాధీనం

Drug Case: తమిళ నటుడు సూర్య హీరోగా నటించిన ‘సింగం’ సినిమాలో కనిపించిన నైజీరియన్ దేశస్థుడు, నటుడు చాక్విమ్మాల్విన్..డ్రగ్స్‌కేసులో కర్ణాటక పోలీసులకు దొరికిపోయాడు. బెంగళూరు కాడుగూండనహళ్లి పోలీసులు అతడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్‌ఆయిల్ సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, పలు సినిమాల్లో.. చాక్విమ్ కన్నడ సహా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు. అన్నబాండ్, పరమాత్మ వంటి 20 కన్నడ సినిమాల్లో, తమిళ్‌లో సింగం, విశ్వరూపం సినిమాల్లో నటించి మెప్పించాడు. ముంబయిలో యాక్టింగ్‌లో శిక్షణ మెడికల్వీసాపై భారత్‌కు వచ్చిన చాక్విమ్… ముంబయిలోని న్యూయార్క్ ఫిల్మ్అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అంతకుముందు.. 2006లో అతడు ఆరు నెలలపాటు నైజీరియా రాజధాని అబుజాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలోనూ శిక్షణ పొందాడు.
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు..
లాక్‌డౌన్ సమయంలో సినిమా అవకాశాలు రాకపోగా… చాక్విమ్ డ్రగ్స్అమ్మకాలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కళాశాల విద్యార్థులు, వ్యాపారులకు అతడు డ్రగ్స్‌సరఫరా చేశాడని తెలిపారు. ఆఫ్రికా నుంచి అక్రమంగా తరలించిన డ్రగ్స్‌ను అతడు విక్రయించేవాడని పేర్కొన్నారు. కాడుగూండనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తుపదార్థాలను విక్రయిస్తుండగా తాము రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఎవరెవరితో సంబంధం ఉంది?చాక్విమ్ఎన్నేళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు? అతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఈ వ్యవహారంలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇవీ కూడా చదవండి:
Hero MotoCorp: భారత్‌లో భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్ బైక్‌ల ధరలు.. కొత్త ధరల వివరాలు ఇవే..!
SBI Offers: మీరు ఎస్‌బీఐ డెబిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో శుభవార్త.. ఏంటంటే..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3urfxwt
0 Response to "Drug Case: డ్రగ్స్ దందాలో సింగం నటుడు అరెస్టు.. భారీగా మత్తు పదార్థాల స్వాధీనం"
Post a Comment