Crime News: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం.. వెళ్తున్న కారులో..

Man killed in car fire: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగి ఒక్కరు సజీవ దహనం అయ్యారు. శంషాబాద్ నుంచి తుక్కుగుడ వైపు వస్తున్న కారులో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబరు 17 వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే కారు మొత్తం మంటలు వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
ఆల్టో కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
Ganesh Immersion: బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధం.. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు
దేశ భద్రతకు ప్రమాదకరం.. విపత్తుగా మారబోతున్నాడు. సిద్ధూపై అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EsCXX3


0 Response to "Crime News: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం.. వెళ్తున్న కారులో.."
Post a Comment