-->
Crime News: కసాయి తండ్రి ఘాతుకం.. రెండేళ్ల కొడుకుని కత్తితో గొంతు కోసి.. అతి దారుణంగా..

Crime News: కసాయి తండ్రి ఘాతుకం.. రెండేళ్ల కొడుకుని కత్తితో గొంతు కోసి.. అతి దారుణంగా..

Father Killed His Son

Father brutally killed his Son: అభం శుభం తెలియని రెండు సంవత్సరాల కుమారుడిని కసాయి తండ్రి అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపాడు. హైదరాబాద్ పరిధిలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ కు చెందిన హాసిబ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. గత ఆరు సంవత్సరాల క్రితం హస్రత్ బేగంతో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఇతనికి ఇద్దరు సంతానం. కాగా.. హాసిబ్‌ గత మూడు సంవత్సరాలుగా మానసికంగా బాగా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు.

అయితే శుక్రవారం మధ్యాహ్నం నాలుగున్నర గంటల సమయంలో అనూహ్యంగా దారుణానికి ఒడిగట్టాడు. రెండేళ్ల కన్న కొడుకును అతి కిరాతకంగా చంపాడు. పెద్ద కుమారుడు ఇస్మాయిల్ (2) ను మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. ఇంట్లో భార్య హస్రత్ బేగం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించింది. అయితే.. అప్పటికే కుమారుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Also Read:

Miss Universe Singapore 2021: మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌గా తెలుగమ్మాయి.. నందిత బన్న.. ఆమెది ఎక్కడో తెలుసా..?

DGP Mahender Reddy: అసలు ఆ అనుమానాలే అక్కర్లేదు.. రేపిస్ట్ రాజు మృతిపై డీజీపీ కీలక వ్యాఖ్యలు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3AlkIAz

Related Posts

0 Response to "Crime News: కసాయి తండ్రి ఘాతుకం.. రెండేళ్ల కొడుకుని కత్తితో గొంతు కోసి.. అతి దారుణంగా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel