
Crime News: పరారీలో ఉన్న పబ్బుల ఓనర్ మురళి లొంగుబాటు.. హత్యాయత్నం కేసులో..

Lisbon Pub: హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లిస్బన్ పబ్ ఓనర్ మురళి నాంపల్లి కోర్టులో గురువారం లొంగిపోయాడు. పబ్‌కి వచ్చిన ఓ యువతి పై మురళి, అతని బృందం దాడిచేసి గాయపరిచారు. దీంతో ఆమె ఫిర్యాదుపై పోలీసులు మురళిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి మురళి తప్ప మిగిలిన వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మురళి కొన్ని రోజుల నుంచి తప్పించుకుతిరుగుతున్నాడు. కాగా.. ఇన్నిరోజులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మురళి గురువారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.
హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మురళికి సంబంధించిన మూడు పబ్‌లను.. కలెక్టర్ ఆదేశాలతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మురళిపై ఇప్పటికే 18 వరకు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు హత్య యత్నం కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలను తీవ్రం చేశారు. కోర్టులో లొంగిపోయిన అనంతరం.. మురళిని విచారణ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడికి అప్పగించింది. పోలీసులు అనంతరం నిందితుడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
Also Read:
KTR: సొంత పార్టీ ఎంపీ, కీలక నేతపై రేవంత్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్.. ఆడియో క్లిప్‌ను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే..
PM Narendra Modi Birthday: నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం.. 71 వేల దీపాలతో శుభాకాంక్షల వెల్లువ.. అర్ధరాత్రి నుంచే..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Es0SG0
0 Response to "Crime News: పరారీలో ఉన్న పబ్బుల ఓనర్ మురళి లొంగుబాటు.. హత్యాయత్నం కేసులో.. "
Post a Comment