-->
Covid-19 Third Wave: కరోనా ముప్పు తొలిగిపోలేదు.. వ్యాక్సిన్లు తీసుకోండి: డీహెచ్‌ శ్రీనివాసరావు

Covid-19 Third Wave: కరోనా ముప్పు తొలిగిపోలేదు.. వ్యాక్సిన్లు తీసుకోండి: డీహెచ్‌ శ్రీనివాసరావు

Health Director Srinivas Rao

Health Director Srinivas Rao: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పెరిగిన కేసులతో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. కరోనా కొత్త వేరియంట్‌ వస్తే తప్ప తెలంగాణలో మూడో వేవ్‌ వచ్చే అవకాశాలు లేదని శ్రీనివాసరావు స్పష్టంచేశారు. అలా అని ముప్పు తొలగిపోయినట్లు అనుకోవద్దని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సోమవారం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందని.. పాజిటివిటీ రేటు 0.4 శాతం మాత్రమే ఉందని ఆయన తెలిపారు.

అయితే.. విద్యా సంస్థలు పునః ప్రారంభమైనందున కోవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతాయని అంచనా వేశామని.. కానీ ఎక్కడా క్లస్టర్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఇప్పటివరకు 3200 పాఠశాలల్లో 1.15 లక్షల మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా.. 55 మందికి వైరస్‌ సోకినట్లు తెలిపారు. ఒకవేళ కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్‌లో ఆక్సిజన్ అవసరం ఉంటే మనమే ఉత్పత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, 40 శాతం ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ ప్లాంట్స్‌తో సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. చిన్నారుల కోసం 3,600కుపైగా పడకలను సిద్ధంగా ఉంచినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

అయితే.. హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. 2019లో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 4వేలు రిపోర్ట్ కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 10 వరకు 3 వేల కేసులు నమోదైనట్లు తెలిపారు. వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

డెంగ్యూ ప్లేట్‌లెట్స్‌పై కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయని అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ డబ్బులడిగినా.. ఏవైనా సమస్యలు ఉన్నా ప్రజలు 102 నంబర్‌కు ఫోన్‌ ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.

Also Read:

CM KCR: ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలి.. అర్హులైన వారికి ఆ రంగాల్లో రిజర్వేషన్లు: సీఎం కేసీఆర్‌

TS Corona Cases: తెలంగాణలో మరోసారి కరోనా గుబులు.. గడిచిన 24గంటల్లో పెరిగిన కొత్త కేసులు.. ఇద్దరు మృతి



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3z8WoAc

0 Response to "Covid-19 Third Wave: కరోనా ముప్పు తొలిగిపోలేదు.. వ్యాక్సిన్లు తీసుకోండి: డీహెచ్‌ శ్రీనివాసరావు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel