
CM KCR: హైదరాబాద్ మెట్రోను ఆదుకుంటాం.. భవిష్యత్తులో సేవలు మరింత విస్తరించాలి: సీఎం కేసీఆర్

Hyderabad Metro: కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్ అండ్ టీ కంపెనీ ఉన్నతాధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో, కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం కేసీఆర్ హామినిచ్చారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఎల్అండ్‌టీ కలిశారు. కరోనా కాలంలో మెట్రో ఎదుర్కోంటున్న ఆర్థిక నష్టాలను, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సిఎం కేసిఆర్ మాట్లాడుతూ…అనతి కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ప్రజాధరణ పొందిందన్నారు. కరోనా పరిస్థితులు అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టిందని సీఎం కేసిఆర్ తెలిపారు. దినాదినాభివృధ్ది చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మెట్రో మరింతగా విస్తరించాల్సి వుందన్నారు. కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు. అన్ని రంగాలను ఆదుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తమవంతు కృషి చేస్తుందన్నారు. ఎటువంటి విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతామో విశ్లేషిస్తామని తెలిపారు. సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ప్రజావసరాల దృష్ట్యా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందన్నారు. వీటన్నింటిపై ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్), రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంఎయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఉంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. మెట్రోను నష్టాల నుంచి ఆదుకునే అంశంపై అన్ని రకాలుగా పరిశీలించి అధ్యయనం చేసి అతి త్వరలో నివేదిక అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మెట్రో, ఎల్ & టి అధికారులతో ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. pic.twitter.com/cAHrJzvECj
— Telangana CMO (@TelanganaCMO) September 14, 2021
Also Read:
AP Inter Exams 2021: ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. నేటినుంచి ఏపీలో ఎగ్జామ్స్.. షెడ్యూల్ ఇలా..
JEE Mains 2021 Result: జేఈఈ మెయిన్స్ ఫలితాలు మరికాసేపట్లో.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/39dLQ8l
0 Response to "CM KCR: హైదరాబాద్ మెట్రోను ఆదుకుంటాం.. భవిష్యత్తులో సేవలు మరింత విస్తరించాలి: సీఎం కేసీఆర్"
Post a Comment