-->
జాతిరత్నాలు డైరెక్టర్‌ దర్శకత్వంలో వెంకీమామ..! ఈ సారి ఓ రేంజ్ లో ఫన్ రిపీట్..(వీడియో)

జాతిరత్నాలు డైరెక్టర్‌ దర్శకత్వంలో వెంకీమామ..! ఈ సారి ఓ రేంజ్ లో ఫన్ రిపీట్..(వీడియో)

Venkatesh Next With Jathi Ratnalu Kv Anudeep Video

లాక్‏డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్‏తో తెరకెక్కించిన ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్‏లో సూపర్ హిట్‏గా నిలిచింది. ఈ మూవీ తర్వాత నవీన్ పోలిశెట్టికి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ఇంతటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనుదీప్ రూపొందించాడు. తొలి ప్రయత్నంలోనే కామెడీని ఎంచుకుని సక్సెస్ అయ్యాడు అనుదీప్. ముఖ్యంగా చాలా కాలం తర్వాత కోవిడ్ పరిస్థితులలోనూ జనాలను థియేటర్లకు రప్పించాడు అనుదీప్. చాలా కాలంగా వినోదానికి దూరమైన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతో.. అనుదీప్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ యంగ్ డైరెక్టర్‏తో సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత.. అనుదీప్.. ఎవరితో సినిమా చేయనున్నాడని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ఓ మూవీ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారని వినిపించింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా అనుదీప్ తదుపరి సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అనుదీప్.. వెంకటేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం వెంకటేష్‏తో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లుగా సమాచారం. అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Online Gaming: ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన బాలుడు.. 19 లక్షలు సమర్పించుకున్నాడు..!(వీడియో)

 బెయిల్‌పై రాజ్‌కుంద్రా విడుదల పై శిల్పాశెట్టి..! మొదటి ఇన్‌స్టా పోస్ట్‌లో సంచలన కొటేషన్‌..(వీడియో)

 Gems Bond car: అమ్మకానికి గన్స్‌ ఉన్న జెమ్స్‌బాండ్‌ కారు.! ఆస్టోన్‌ మార్టిన్‌ సంస్థ నిర్ణయం..(వీడియో)

 Tanish Maro Prasthanam Movie: ‘మరో ప్రస్థానం’పై హీరో తనీష్ మాటల్లో ఎం ఉందో.. డ్రస్సింగ్ పై ఆసక్తికర విషయాలు..(వీడియో)



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kyuF8b

0 Response to "జాతిరత్నాలు డైరెక్టర్‌ దర్శకత్వంలో వెంకీమామ..! ఈ సారి ఓ రేంజ్ లో ఫన్ రిపీట్..(వీడియో)"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel