-->
భద్రాద్రి కో-ఆపరేటివ్ బ్యాంకులో సిబ్బంది చేతివాటం.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ ఇంటిదొంగల గుట్టు!

భద్రాద్రి కో-ఆపరేటివ్ బ్యాంకులో సిబ్బంది చేతివాటం.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ ఇంటిదొంగల గుట్టు!

Bhadradri Co Operative Urban Bank

Bhadradri Co-operative Urban Bank: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి కో-ఆపరేటివ్ బ్యాంకు సిబ్బంది ఇంటి దొంగల గుట్టు బట్టబయలైంది. జనం సొమ్ముకు ఎగనామం పెట్టాలని చూశారు. ఎట్టకేలకు ఫోలీసుల ఎంట్రీతో అడ్డంగా దొరికిపోయారు. రూ.2 కోట్ల 91 లక్షల రూపాయలను సొంత అవసరాలకు వాడుకున్నారు. రెండు సంవత్సరాలుగా తతంగం.. గుర్తించిన బ్యాంక్ యాజమాన్యం.. పోలీసులకు పిర్యాదు చేశారు. అవకతవకలకు పాల్పడిన నలుగురు బ్యాంక్ సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు.. రూ.కోటి 44 లక్షలు స్వాదీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

మణుగూరు భద్రాద్రి కో-అపరేటివ్ బ్యాంకు లో దొంగలు పడ్డారు. వినియోగదారుల సొమ్మును సొంత అవసరలకు వాడుకుంటున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి కోటి 44 లక్షల రూపాయలను స్వాదీనం చేసుకుని కటకటాల వెనక్కు పంపించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ సునీల్ దత్ చెప్పిన వివరాల ప్రకారం… మణుగూరు భద్రాద్రి కో-అపరేటివ్ బ్యాంకులో వినియోగదారులకు సంబంధించిన సొమ్మును సిబ్బంది సొంత అవసరాలకు వాడుకున్నారు. బ్యాంకు యాజమాన్యం చేసిన ఆడిట్ లో ఈ విషయం బయట పడడంతో బ్యాంక్ సీఈవో పోలీసులకు పిర్యాదు చేశారు.

భద్రాద్రి కో-అపరేటివ్ బ్యాంకులో విధులు నిర్వహించేమేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, క్యాషియర్, అటెండర్ ముఠాగా ఏర్పడి 2 కోట్ల 91 లక్షల రూపాయలను ప్రక్క దారి పట్టించి సొంత అవసరాలకు వాడుకున్నారు. ఈ విషయం బ్యాంక్ యాజమాన్య ఆగస్టు నెలలో చేసిన ఆడిట్ లో బయటపడింది. దీంతో వెంటనే బ్యాంక్ సీఈవో సాంబమూర్తి పోలీసులకు పిర్యాదు చేయగా అసలు విషయం బట్టబయలు అయింది… ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చేసిన విషయాలలో అనేక విషయాలు బయటపడ్డాయి. బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న మేనేజర్ రాము, అసిస్టెంట్ మేనేజర్ అక్బర్, క్యాషియర్ రామారావు, అటెండర్ రవీందర్ ముఠాగా ఏర్పడి సొంత అవసరాలకోసం వినియోగదారుల సొమ్మును గత రెండు సంవత్సరాలుగా వాడుకుంటున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

యాజమాన్యం తనిఖీలు చేసే సమయంలో ఎటువంటి అనుమానం రాకుండా డబ్బును సర్దుతూ ఈ తతంగం నడుపుతున్నట్లుగా తేలింది. ఆగష్టు మాసంలో బ్యాంక్ యాజమాన్యం చేసిన సాదారణ తనిఖీల్లో విషయం బహిర్గతం అవడంతో బ్యాంక్ సీఈవో సాంబమూర్తి పిర్యాదు చేశారు. ఫిర్యాదును ఛాలెంజ్‌గా తీసుకున్న మణుగూరు పోలీసులు నెల రోజుల వ్యవధిలో మొత్తం వ్యవహారాన్ని ఛేదించారు.. పరారీలో ఉన్న నిందితులకోసం వెతుకుతూ ఎట్టకేలకు అందరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 1 కోటి 44 లక్షల రూపాయలను స్వాదీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిగిలిన 1కోటి 47 లక్షలకు సంబంధించి బ్యాంక్ యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కానీ, మరో వైపు వినియోగదారులు భయంతో వనికిపోతున్నారు. తాము కాయ కష్టం చేసి సంపాదించుకున్న డబ్బుని బ్యాంకులో దాచుకుంటే దాన్ని బ్యాంక్ సిబ్బంది వాడుకోని తమను నిలువునా ముంచారని బ్యాంక్ యాజమాన్యమే తమకు న్యాయం చేయాలని భాదితులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also…  Gold-Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. అదే బాటలో పయనిస్తున్న వెండి.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lUmdj5

Related Posts

0 Response to "భద్రాద్రి కో-ఆపరేటివ్ బ్యాంకులో సిబ్బంది చేతివాటం.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ ఇంటిదొంగల గుట్టు!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel