
Bigg Boss Telugu 5: ఇప్పటికి కళ్లుతెరిచిన షణ్ముఖ్.. సిరిని అంతమాట అనేశాడేంటి.. !!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్5 రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్‌లో ఉన్న వారు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికి అర్ధంకాకుండా ఉంది. అప్పటివరకు నవ్వుతూ.. ఫ్రెండ్స్ అంటూ కలరింగ్ ఇచ్చిన వాళ్లే సడన్‌గా విమర్శించుకుంటూ.. తిట్టుకుంటూ.. ఏడుస్తూ.. రచ్చచేస్తున్నారు. ఇక హౌస్‌లో ఉన్నవాలందరిలో సిరి చాలా తెలివిగా సేఫ్ గేమ్ ఆడుతుందని మొదటి నుంచి విమర్శలు వినిపిస్తూ వస్తున్నాయి. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా సిరి -షణ్ముఖ్ కలిసి గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. సరయు అయితే ఈ విషయం పై చాలా సీరియస్ అయ్యింది. ఇక ఇక్క ఇప్పటికి షణ్ముఖ్ కళ్ళు తెరిచాడు. సిరి తనని అడ్డు పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుతుందని షణ్ముఖ్ కు అర్ధమైంది. నిన్నటి ఎపిసోడ్‌లో జెస్సీతో మాట్లాడుతూ..
నాకు ఎక్కడో కొడుతుందని అనిపిస్తుంది. .. జరుగుతున్నావనీ చూస్తుంటే… మనం ఇన్ డైరెక్ట్‌గా సిరికి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే బెడ్ మారిపోదాం.. ఆమెను దూరం పెట్టడమే బెటర్ అని అనిపిస్తుంది.. సిరి ఎందుకో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది.అది నాకు నచ్చడం లేదు. ..నేను సిరి నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. అలా ఎక్స్‌పెక్ట్ చేయడం నాదే తప్పు’ అంటూ జెస్సీకి చెప్పుకున్నాడు షణ్ముఖ్. మొత్తానికి సిరి తనను అడ్డుపెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుతుందని అర్ధం చేసుకున్నాడు షణ్ముఖ్. గతంలో కెప్టెన్సీ టాస్క్ సమయంలో సిరికి మద్దతు పలికాడు. సన్నీ విషయంలో సిరి వైపు మాట్లాడి దొరికిపోయాడు. మొత్తానికి సిరికి సపోర్ట్ చేయకూడదని షణ్ముఖ్ నిర్ణయించుకోవడం మంచి నిర్ణయం అని ప్రేక్షకులు అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Maa Elections 2021: ఎన్నికల బరిలోకి విష్ణు.. మరికాసేపట్లో తన ప్యానెల్‌ను ప్రకటించనున్న మంచు వారబ్బాయి..
Bigg Boss Ariyana: గుడ్ న్యూస్ షేర్ చేసిన అరియనా గ్లోరి.. అంతా దేవుడి చల్లని దీవెన అంటూ..
SIIMA Awards 2021 Photos: సైమా అవార్డ్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫొటోస్.. చిరు – విశ్వనాథ్ అనుబంధం హైలెట్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lSYRds
0 Response to "Bigg Boss Telugu 5: ఇప్పటికి కళ్లుతెరిచిన షణ్ముఖ్.. సిరిని అంతమాట అనేశాడేంటి.. !!"
Post a Comment