
Bigg Boss Ariyana: గుడ్ న్యూస్ షేర్ చేసిన అరియనా గ్లోరి.. అంతా దేవుడి చల్లని దీవెన అంటూ..

Bigg Boss Ariyana: బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు ఏ రేంజ్‌లో వినోదాన్ని అందిస్తుందో షో పాల్గొన్న సభ్యులకు అంతకంటే ఎక్కువ పాపులారిటీని తెచ్చిపెడుతోంది. ఈ షోకు వచ్చే కంటే ముందు కొందరికే తెలిసిన వాళ్లు హౌజ్ నుంచి అడుగు బయటపెట్టగానే ఎక్కడ లేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. వరుస ఆఫర్లతో దూసుకుపోతూ ఇటు పాపులారిటీ పరంగా అటు ఆర్థికంగా దృఢంగా మారుతున్నారు. ఇక అరియానా విషయానికొస్తే బిగ్‌బాస్‌కు ముందు యూట్యూబ్ ఛానల్‌లో చిన్న యాంకర్‌గా ఉన్న ఈ అందాల ముద్దుగుమ్మ షో నుంచి బయటకు వచ్చాక ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది.
View this post on Instagram
ఈ క్రమంలోనే అరియానాకు ఆఫర్లు కూడా పెరిగాయి. ఇక అరియానా ఆర్థికంగా నిలదొక్కుకుంటోంది ఈ క్రమంలోనే తాజాగా ఈ అందాల తార కొత్త కారు కొనుగోలు చేసింది. కియా కంపెనీకి చెందిన హై ఎండ్ కారును ఇటీవల సొంతం చేసుకున్న ఈ చిన్నది ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. కారు కొన్ని సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘కొత్త కారుకు సుస్వాగతం. దేవుడి చల్లని దీవెనకు కృతజ్ఞతలు. నా కొత్త కారు ఎలా ఉంది చెప్పండి.?’ అంటూ క్యాప్షన్ జోడించింది. ఇక స్నేహితులు సోహైల్, బుల్లితెర నటుడు అమర్‌దీప్‌లతో కలిసి కొత్త కారులో షికార్లు మొదలు పెట్టేసిందీ చిన్నది. అరియానా పోస్టు చూసిన ఆమె అభిమానులు కాంగ్రాట్స్ చెబుతున్నారు.
View this post on Instagram
Smartphone Settings: మీ స్మార్ట్‌ఫోన్ స్లో అవుతుందా..? ఈ సెట్టింగ్స్ మార్చితే వేగవంతం అవుతుంది..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nVO0Cn
0 Response to "Bigg Boss Ariyana: గుడ్ న్యూస్ షేర్ చేసిన అరియనా గ్లోరి.. అంతా దేవుడి చల్లని దీవెన అంటూ.."
Post a Comment