-->
Bigg Boss 5 Telugu: ఆమె చాలా ఓవర్ హైపర్‌గా ఉంటుంది.. అయినా నామినేట్ చేయలేక పోయా.. అసలు కారణం చెప్పిన షణ్ముఖ్..

Bigg Boss 5 Telugu: ఆమె చాలా ఓవర్ హైపర్‌గా ఉంటుంది.. అయినా నామినేట్ చేయలేక పోయా.. అసలు కారణం చెప్పిన షణ్ముఖ్..

Shanmukh

బిగ్ బాస్ రచ్చ నాలుగో రోజు కాస్త ఎక్కువగానే కనిపించింది. కాటెస్టెంట్స్ మధ్య గొడవలు, అల్లర్లు, ఏడుపులు మధ్య రసవత్తరంగా సాగింది నాలుగో రోజు. ఇక పవర్ రూం యాక్సెస్ పొందిన హమీదా, మానస్, విశ్వ, సిరిలు మధ్య కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. దీంతో ఈ నలుగురి మధ్య కెప్టెన్ కోసం సైకిల్ పోటీ జరిగింది. అయితే ముందు సిరి గేమ్ ఆడతా.. కానీ నేను పోటీ ఇవ్వలేనేమో అని భయంగా ఉంది అంటూ వెనకడుగేసే ప్రయత్నం చేసింది. అయితే సన్నీ, జెస్సీలు ఆమెకు దైర్యం చెప్పారు. దాంతో సిరి గేమ్‌లో పాటిస్పెట్ చేసింది. చివరకు సిరినే విజేతగా నిలిచి మొదటి కెప్టెన్ అయ్యింది. మరోవైపు నాలుగో రోజుల్లోనే హౌస్‌లో గ్రూప్‌లు ఏర్పడ్డాయని సరయు ఆనీ మాస్టర్ దగ్గర ఎమోషనల్ అయ్యింది.

ఇన్ని రోజులు కెమెరాకు కంటపడకుండా సైలెంట్‌గా ఉంటున్నాడు షణ్ముఖ్. అయితే  నాలుగో రోజు ఎట్టకేలకు షణ్ముఖ్‌‌‌కు స్క్రీన్ స్పేస్ దక్కింది. షణ్ముఖ్ ఓపెన్ అయ్యాడు. ఇన్నిరోజులు ఎవ్వరితో మాట్లాడకుండా .. ఎవ్వరిని పట్టించుకోకుండా ఉన్న షణ్ముఖ్ ఇప్పటికి నోరు విప్పాడు. మొన్నామధ్య షణ్ముఖ్.. ‘ఇంత మంది మధ్య తాను ఎప్పుడులేనని .. తనకు బిగ్ బాస్ సెట్ కావాడం లేదని.. దీనికంటే బయటకు వెళ్లి వీడియోలు చేసుకోవడం బెటర్’ అని ఓపెన్ అయిన విషయం తెల్సిందే. ఇక తాజా ఎపిసోడ్‌లో షణ్ముఖ్ ఉమ తనతో మాట్లాడటం లేదని.. ఆమె చాలా ఓవర్ హైపర్‌గా ఉంటున్నారని చెప్పుకొచ్చాడు. ఇక తన తల్లి పేరు కూడా ఉమ కావడం వల్లే నామినేట్ చేయలేదని లేదంటే చేసేవాడినని కాజల్, సిరిల దగ్గర చెప్పుకున్నాడు షణ్ముక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5: బిగ్ బాస్: కెప్టెన్సీ టాస్క్‌లో రచ్చ.. హౌస్‌కు తొలి కెప్టెన్‌గా చలాకీ సిరి.!

Bigg Boss 5 Telugu: భయమా..? లేక ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజనా..? కెమెరాకు కనబడని షణ్ముఖ్.. నావల్ల కాదు అంటూ…

Bigg Boss 5 Telugu: నా ఫుల్ సపోర్ట్ ఆ కంటెస్టెంట్‏కే.. బిగ్‏బాస్ షోపై మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/38UkZ11

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: ఆమె చాలా ఓవర్ హైపర్‌గా ఉంటుంది.. అయినా నామినేట్ చేయలేక పోయా.. అసలు కారణం చెప్పిన షణ్ముఖ్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel