-->
Bigg Boss 5 Telugu: సైకోలా మారిన ఆ కంటెస్టెంట్.. ప్రియపై లోబో విశ్వరూపం..

Bigg Boss 5 Telugu: సైకోలా మారిన ఆ కంటెస్టెంట్.. ప్రియపై లోబో విశ్వరూపం..

Priya Lobo

బిగ్‏బాస్ కంటెస్టెంట్లకు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ పెద్ద గండమనే చెప్పాలి. మిగతారోజులు.. సాఫీగా సాగిపోయిన.. నామినేషన్స్ రోజున మాత్రం ఒకరిపై ఒకరు నిందించుకుంటూ తమ ప్రతాపన్ని చూపిస్తుంటారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న కంటెస్టెంట్స్.. చివరకు నామినేషన్ సమయానికి సైకోలుగా మారిపోతుంటారు. ఇప్పటివరకు జరిగిన మూడు వారాల నామినేషన్స్ ప్రక్రియతో ఇంటిని రణరంగంగా మార్చిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి నామినేషన్ ప్రక్రియ ఒక్కో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. ముఖ్యంగా లోబో సైకోగా మారి ప్రియపై విరుచుకుపడ్డాడు.

నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టిన ప్రియ.. తనతో సన్నీ, లోబో సరిగ్గా మాట్లాడడం లేదని చెబుతూ నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన లోబో.. ప్రియను నామినేట్ చేస్తూ రెచ్చిపోయాడు. నేను నా జీవితంలో ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్తుంటే.. సినిమా స్టోరీలా ఉందన్నావ్.. ఆ మాటతో నా ఖలేజా పగిలిపోయింది. నన్ను తిట్టు, చెప్పు తీసుకుని కొట్టు వింటా.. కానీ అలా మాట్లాడకు అంటూ విశ్వరూపం ప్రదర్శించాడు. అలాగే దారుణంగా అరుస్తూ.. ప్రియపైకి దూసుకెళ్లాడు. దీంతో రవి.. అతడిని వారించే ప్రయత్నం చేశాడు. నా లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదరా అంటూ ఏడ్చేసాడు లోబో.. ఇక లోబో అనుహ్య ప్రవర్తనకు ప్రియ ఒక్కసారిగా షాకయ్యింది. ఏం మాట్లాడాలో తెలియక.. మౌనంగానే ఉండిపోయింది. మనసులో ఒకటి పెట్టుకుని మరొకటి మాట్లాడకు లోబో అంటూ వార్నింగ్ ఇచ్చింది. రవితో తనకు గొడవ అయిన కారణంగానే.. లోబో తనతో మాట్లాడటం మానేశాడని చెప్పుకొచ్చింది. నేను టైంపాస్ ప్రేమించలే.. అమ్మాయికి గౌరవం ఇచ్చా అని చెప్తుండగా.. తెలుస్తుంది అమ్మాయిలకు ఎంత గౌరవమిస్తావో అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది ప్రియ. జనాలవల్లే తాను ఇక్కడ ఉన్నానని.. చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. లోబో దారుణ ప్రవర్తన చూసిన ప్రియ ఏడ్చేసింది. ఇక తర్వాత.. లోబో, సిరిని నామినేట్ చేస్తూ.. కాజల్ తన లవ్ స్టోరీ చెప్తుండగా.. ఆకలేస్తుంది అని ఎలా అనగలిగావంటూ ప్రశ్నించాడు. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో లోబో శ్రుతి మించి మరి రెచ్చిపోయాడు.

Also Read: Bigg Boss 5 Telugu: నాలుగోవారంలో నామినేషన్స్‏లో ఉన్నది వీరే.. రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఒక్కొక్కరి నటన మాములుగా లేదుగా..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/39HLkjh

0 Response to "Bigg Boss 5 Telugu: సైకోలా మారిన ఆ కంటెస్టెంట్.. ప్రియపై లోబో విశ్వరూపం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel