-->
Bigg Boss 5 Telugu: వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. రవికి ఇచ్చిపడేసాడుగా..

Bigg Boss 5 Telugu: వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. రవికి ఇచ్చిపడేసాడుగా..

Bigg Boss 5

బిగ్‏బాస్ సీజన్ 5 రెండు వారాలు ఎలిమినేషన్ ప్రాసెస్ సాఫీగానే సాగిపోయింది. కానీ మూడవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ప్రియ, రవి, లహరిల మద్య జరిగిన రచ్చతో అంతా నాగార్జున వచ్చి ఎవరికి క్లాస్ తీసుకుంటారో అని శనివారం ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లహరి, రవి.. అర్ధరాత్రి హగ్గులు అంటూ ప్రియ చేసిన కామెంట్స్‏తో ఇంట్లో పెద్ద రచ్చే జరిగింది. లహరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు.. అని రవి బుకాయించడం.. తిరిగి ప్రియపైనే విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇటు ప్రేక్షకులకు రవి, ప్రియ మాట్లాడుకున్న వీడియో బయటకు రావడంతో అసలు విషయం తెలియడం.. దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో అనేది తెలుసుకోవడానికి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున్ అందరి సందేహాలను క్లియర్ చేసేసాడు.

ఎన్టీఆర్ రావణా పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. రావడంతో ఫుల్ సీరియస్ మోడ్‏లో వచ్చిన నాగ్.. అందరి ప్రశ్నలకు ఈరోజు సమాదానం తెలియాలంటూ ఆట మొదలు మొదలు పెట్టారు. ఇక రావడంతోనే… రవి, ప్రియ నేమ్ ప్లేట్ సుత్తితో పగలకొట్టి.. రవిని ఏమైంది అని అడిగాడు. నామినేషన్స్ లో లహరిని నామినేట్ చేస్తూ.. మధ్యలో నన్ను లాగింది. లహరి నేను.. హగ్ చేసుకున్నాం.. మిడ్ నైట్.. బాత్ రూం అంటూ మాట్లాడింది. కానీ అక్కడ ఏం లేదు.. నార్మల్ గా హాల్ లో హగ్ చేసుకున్నట్టే అక్కడ చేసుకున్నాం అంటూ చెప్పుకోచ్చాడు రవి. సీన్ జరగలేదు అంటే ఏంటీ.. నీ ఉద్దేశం.. మీరు బయట హగ్ చేసుకుంటే సీన్ కాదు.. కానీ బాత్ రూం దగ్గర చేసుకున్నందుకే కదా.. ఈ ఇష్యూ సీరియస్ అయ్యింది. నీ ఉద్దేశ్యంలో తప్పు ఎవరిది అంటావ్ అని అడగ్గా.. ప్రియ గారిదే అంటూ చెప్పుకొచ్చాడు రవి. దీంతో ప్రియ నువ్వేమంటావ్ అని అడగ్గా… నేను వాళ్లని తప్పుగా అర్థం చేసుకోలేదు.. లహరి అడిగినందుకే నేను విషయం చెప్పాను. ఆ సందర్భంలో నేను మెన్ అనే విషయాన్ని మెన్షన్ చేశాను అంచూ చెప్పుకొచ్చింది. దీంతో నాగార్జున మాట్లాడుతూ.. జెండర్ డిఫరెన్స్ లేదు. హగ్ ఇవ్వడం బిజీగా ఉండటమా ? అంటూ ప్రశ్నించాడు.

ఇక ఆ తర్వాత లహరిని పవర్ రూంకు వెళ్లమని చెప్పి.. అక్కడ రవి, ప్రియ మాట్లాడుకున్న వీడియోను చూపించాడు. అందులో రవి మాట్లాడుతూ.. లహరి తన వెంటపడుతుందని.. యాంకర్ కావడం కోసం ఇలా చేస్తుందని.. పెళ్లైన వాళ్లు చాలామంది ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని బ్యాడ్‌గా మాట్లాడిన మాటల్ని చూసి షాకైంది లహరి. ఇక ఆ తర్వాత లహరి ఇప్పుడు తప్పు ఎవరిదో అర్ధమైందిగా వెళ్లి తప్పు ఉన్నవాళ్లను నిలదీయి.. తప్పు లేని వాళ్లను హగ్ చేసుకో అని చెప్పాడు. ఇక బయటకు వచ్చిన లహరి.. రవిని చూస్తూ.. నువ్ నాతో ఏం చెప్పావ్.. ప్రియ గారితో ఏం చేప్పావ్..నేను యాంకర్ కావడానికి నీ వెనకపడ్డానా అంటూ నిలదీసింది. దీంతో రవి నేను అలా అనలేదు అంటుండగా.. నేను వీడియో చూసాను అంటూ బదులిచ్చింది. ఇక ఆ తర్వాత ప్రియను వెళ్లి హగ్ చేసుకుంది. మొత్తానికి సోమవారం నుంచి నడుస్తున్న వివాదానికి ఒక్క వీడియోతో పుల్ స్టాప్ పెట్టాడు నాగార్జున.

Also Read: Pawan Kalyan: స‌న్నాసుల్లారా.. సినిమా వాళ్లకు ఊరికే డ‌బ్బులు రావట్లేదు. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్‌.

Nabha Natesh: పట్టు పరికినిలో నభా అందాలు చూడతరమా… లేటెస్ట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ హీరోయిన్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3F2T1iL

0 Response to "Bigg Boss 5 Telugu: వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. రవికి ఇచ్చిపడేసాడుగా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel