-->
Bigg Boss 5 Telugu: అందుకే అతను నన్ను నామినేట్ చేశాడు.. అప్పటి నుంచే అంత గ్రడ్జ్ పెట్టుకున్నాడు.. శివాలెత్తిన సరయు

Bigg Boss 5 Telugu: అందుకే అతను నన్ను నామినేట్ చేశాడు.. అప్పటి నుంచే అంత గ్రడ్జ్ పెట్టుకున్నాడు.. శివాలెత్తిన సరయు

Sarayu

బిగ్‏బాస్ సీజన్ 5 ఎట్టకేలకు వారం రోజులు పూర్తి చేసుకుంది. గొడవలు, అలకలతో రెండో రోజు నుంచే కావాల్సినంత కంటెంట్ ఇస్తూ.. ప్రేక్షకులను ఎంటర్‏టైన్ చేస్తూనే ఉన్నారు హౌస్ మెంబర్స్. ఇక వీకెండ్‏లో నాగార్జున వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. సండే ఫన్ ‏డే అంటూ వచ్చే నాగార్జున.. ఇంటి సభ్యులతో ఫన్నీగా గేమ్స్ ఆడుతూ.. సలహాలు, వార్నింగ్ చేస్తుంటారు. ఇక ఆదివారం ఫన్నీతో పాటు.. ఎలిమేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. వారం వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తుంటాడు నాగార్జున. ఇక ఈ ఐదో సీజన్ మొదటి రోజునే నామినేషన్ ప్రక్రియ సీరియస్‏గా సాగిన సంగతి తెలిసిందే. యాంకర్ రవి, సరయు, ఆర్జే కాజల్, మానస్, జెస్సీ, హమిదా నామినేట్ అయ్యారు.

ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‏లో నాగ్ హూషారైన స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్స్.. ర్యాంప్ వాక్ అంటూ ఆటలాడించిన నాగార్జున చివరకు సరయు ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించాడు. అలా ఐదో సీజన్ మొదటివారంలో బయటకు వచ్చిన కంటెస్టెంట్ గా సరయు నిలిచింది. ఇక బయటకు వచ్చిన తర్వతా సరయుకు నాగ్.. ఒక టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్‏లో బెస్ట్, వరెస్ట్ మెంబర్స్ గురించి చెప్పమన్నాడు. ఇక సరయు వరుసగా ఒక్కొక్కరికి ఇచ్చిపడేసింది. ముందుగా బెస్ట్ కంటెస్టెంట్స్‏గా విశ్వ, శ్వేత, హమిదా, మానస్, ప్రియాంక గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఇక వరెస్ట్ కంటెస్టెంట్స్‏గా సిరి, సన్నీ, లహరి, షన్ను, కాజల్‏లను ఎంచుకుంది. ఇక వారి గురించి చెబుతూ ఒక్కొక్కరిని ఆడుకుంది.

ముఖ్యంగా ఇందులో సన్నీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సరయు. గతంలో సన్నీతో కలిసి ఓ సినిమా చేశాను. అందులో సన్నీ బాస్‏గా నటించాను. ఇంగ్లీష్‏లో ఓ డైలాగ్ ఉంది. దానిని తప్పుగా రాసారు. నీకు ఎంత దైర్యం ఉంటే నా రూమ్‏లోకి పర్మిషన్ లేకుండా ఎంటర్ అవుతావు అనేది ఉంటే.. గ్రామర్ కరెక్ట్ చేసి.. హౌ డేర్ యూ కమ్ ఇన్ టూ మై రూమ్ వితౌట్ పర్మిషన్ అని రాసా.. అది డైరెక్టర్ కూడా ఓకే చెప్పారు. హౌ డేర్ అంటుంది సర్.. అలా ఎలా అంటుంది అంటూ అప్పటి నుంచి సన్నీ గ్రడ్జ్ పెట్టుకున్నాడు. వచ్చిన మొదటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడలేదు. మనసులో ఇంకా అదే పెట్టుకుని నాతో సరిగ్గా బిహేవ్ చేయలేదు. నేను రా అంటే ఆయనకు నచ్చలేదని నామినేట్ చేశాడు. దాని వల్ల నాకు ఏ మాత్రం బాధ లేదు అంటూ చెప్పుకొచ్చింది సరయు.

Also Read: Bigg Boss 5 Telugu: దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్‌ తొలి ఎలిమినేషన్‌ ఆమే..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3tJ33Ag

0 Response to "Bigg Boss 5 Telugu: అందుకే అతను నన్ను నామినేట్ చేశాడు.. అప్పటి నుంచే అంత గ్రడ్జ్ పెట్టుకున్నాడు.. శివాలెత్తిన సరయు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel