-->
Bigg Boss 5 Telugu: అనుకుందే జరిగింది.. బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఉమాదేవి. ఎలిమినేషన్‌కు ఇవే కారణాలా.?

Bigg Boss 5 Telugu: అనుకుందే జరిగింది.. బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఉమాదేవి. ఎలిమినేషన్‌కు ఇవే కారణాలా.?

Bigboss Umadevi

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో 5వ సీజన్‌ వియవంతంగా రెండో వారం పూర్తి చేసుకుంది. ఇక రెండో వారం ఎలిమినేట్‌ అయ్యేది ఉమాదేవినే అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు తెగ హల్చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున రెండో వారానికి సంబంధించి నటి ఉమాదేవి ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఉమాదేవి హౌజ్‌ నుంచి నిష్క్రమించింది. దీంతో బిగ్‌బాస్‌ 5వ సీజన్‌కు సంబంధించి రెండో ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది.

ఇదిలా ఉంటే రెండో వారం నామినేషన్‌లో ఉమాదేవి, నటరాజ్‌, కాజల్‌, లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్‌ నిలిచారు. చివరికి నటరాజ్‌ మాస్టర్‌, ఉమా దేవి మధ్య గట్టి పోటీ నెలకొనగా.. ఉమకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్‌ అయ్యారు.

Umadevi

ఉమాదేవి ఎలిమినేషన్‌కు కారణాలివేనా.?

ఉమాదేవి ఎలిమినేట్‌ కావడానికి ఆమె కోపమే కారణమని నెటిజన్లు భావిస్తున్నారు. హౌజ్‌లో ప్రతీ కంటెస్టెంట్‌తో కోపానికి దిగుతూ నోటికొచ్చిన బూతులు మాట్లాడడం ప్రేక్షకులకు వినసొంపుగా లేకపోవడమే ఆమెకు ఓట్లు తగ్గిపోయాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియాన్స్‌కు ఉమాదేవీ దూరమయ్యారు. అంతేకాకుండా ఉమాదేవి బిగ్‌బాస్‌ నిబంధనలను పట్టించుకోకుండా హౌజ్‌లో రచ్చ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. ఇది కూడా ఆమెకు ఓట్లు పడకపోవడానికి కారణంగా చెబుతున్నారు.

ఇలా తప్పు మీద తప్పు చేయడంతో ఉమాదేవికి పూర్తి నెగిటివిటి పెరిగిన కారణంగానే హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మూడో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ ఇంకెంత రచ్చకు దారి తీస్తుందో చూడాలి.

Also Read: Chiranjeevi: సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.

Megastar Chiranjeevi: సాయిపల్లవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్.. అసలు కారణం ఇదే..

Sandeep Kishan: జోరు పెంచిన యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్ షూరు చేసిన సందీప్ కిషన్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3tTASym

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: అనుకుందే జరిగింది.. బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఉమాదేవి. ఎలిమినేషన్‌కు ఇవే కారణాలా.?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel