-->
Bigg Boss 5 Telugu: వారిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఆ కంటెస్టెంట్స్‏పై శ్వేత ఉగ్రరూపం..

Bigg Boss 5 Telugu: వారిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఆ కంటెస్టెంట్స్‏పై శ్వేత ఉగ్రరూపం..

Swetha

బిగ్‏బాస్ సీజన్ 5 ఎట్టికేలకు మొదటి వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది.. ఇందులో భాగంగా ఇంటి నుంచి సరయు బయటకు వచ్చేసింది. ఇక నిన్న రెండో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది. ఇక బిగ్‏బాస్ కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టేందుకు రెడి అయ్యాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీంలుగా విడగొట్టి.. వారి మధ్య ఫిటింగ్ పెట్టాడు. నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్‏బాస్ సభ్యులను రెండు టీంలుగా విడగొట్టారు. నక్క, గ్రద్ద అంటూ రెండు టీంలుగా విభజించగా.. నక్క టీంలో ఉమా, లహరి, మానస్, జెస్సీ, రవి, సన్నీ, శ్వేత, నటరాజ్, కాజల్ ఉన్నారు. ఇక గ్రద్ద టీంలో లోబో, విశ్వ, యానీ, శ్రీరాం, ప్రియ, హమీద, సిరి, షణ్ముఖ్, ప్రియాంకలు ఉన్నారు. ఇక ఒక టీంలోని సభ్యుడు ఇతర టీంలోని ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఇంకెముందు.. కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు.

కెప్టెన్ అయినందున సిరిని ఎవరు నామినేట్ చేయకూడదని చెప్పాడు బిగ్‏బాస్. ఇక మొదటగా వచ్చిన సిరి.. ఉమా, నటరాజ్‏లను నామినేట్ చేసింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్.. ప్రియా, ప్రియాంక సింగ్.. యానీ మాస్టర్.. ఉమా, కాజల్, సన్నీ.. ప్రియ, ప్రియాంక, మానస్.. లోబో, ప్రియాలను నామినేట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన లోబో.. శ్వేతను టాస్క్ ఆడగా.. పని చేయగా చూడలేదంటూ నామినేట్ చేశాడు. ఇక రవి తనకు టఫ్ కాంపిటీషన్ అని.. అతడితో దోస్తానా వద్దని దండం పెట్టేసి రవికి రంగు పూశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శ్వేత రెచ్చిపోయింది. లోబో, హమిదాపై ఉగ్రరూపం చూపించింది. ఇక్కడ అసలు రంగులు బయటపడుతున్నాయంటూ లోబో కట్టిన ఫ్రెండ్‏షిప్ బ్యాండ్‏ను తీసి పడేసింది. నా లైఫ్‏లో నన్ను ఎవరూ సపోర్ట్ చేయలేదు.. ఒక్కదాన్నే ఇక్కడి దాకా వచ్చానని సీరియస్ అయ్యింది. కాజల్, ప్రియా లేనప్పుడు వాళ్ల గురించి మాట్లాడావు. ఇప్పుడు మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ లోబోపై విశ్వరూపం చూపించింది. ఇక సెట్ శ్వేత లేదని ఎలా అన్నావు ? అంటూ హమీదా పై తెగ ఆవేశపడిపోయింది. ఆ తర్వాత రంగు తీసి హమీదాకు, లోబో మీద వేసేసింది.

Also Read: Bigg Bigg 5 Telugu: వామ్మో.. ఇదేక్కడి గోల రా బాబు.. నామినేట్ చేయమంటే నోటికి పని చెప్పారు… బూతులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్..

Bigg Boss 5 Telugu 2nd week nomination list: ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్లు.. హౌస్ నుంచి వెళ్లేది ఆమేనా..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nrwSnP

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: వారిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఆ కంటెస్టెంట్స్‏పై శ్వేత ఉగ్రరూపం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel