-->
Bank New Rules: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా..? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Bank New Rules: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా..? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Bank Account

Bank New Rules: బ్యాంకింగ్‌ రంగంలో మెరుగైన సేవలు అందించేందుకు, ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తోంది. ఆర్థిక లావాదేవీల విషయాలలో ఎన్నో నిబంధనలను తీసుకువస్తోంది. కొత్త కొత్త నిబంధనలను తీసుకువస్తూ వినియోగదారులను అలర్ట్‌ చేస్తోంది. ఆర్బీఐ రూల్స్‌ ప్రకారం బ్యాంకుల్లో నిబంధనలు మార్పులు జరుగుతున్నాయి. అలాగే కొన్ని బ్యాంకులు కూడా విలీనమైపోయాయి. ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లను ముందస్తుగానే అప్రమత్తం చేసింది సదరు బ్యాంకులు.

ఇక దేశీ ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) వినియోగదారులను అలర్ట్‌ చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. పాత చెక్‌బుక్స్‌ పని చేయవని సదరు బ్యాంకు వెల్లడించింది. ఓరియెంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెక్‌ బుక్స్‌ చెల్లవని పీఎన్‌బీ తెలిపింది. వాటి స్థానంలో కొత్త చెక్‌బుక్‌లను పొందాలని సూచించింది. ఈ నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త చెక్‌బుక్‌లు పొందని పక్షంలో చెక్ బుక్ ట్రాన్సాక్షన్లు నిలిచిపోతాయని తెలిపింది. లావాదేవీల విషయాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే అక్టోబర్‌ 1లోపు కొత్త చెక్‌బుక్‌లను పొందాలని సూచించింది.

అలాగే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమైన విషయం కస్టమర్లకు తెలిసిందే. అందువల్ల పీఎన్‌బీ నుంచి కస్టమర్లు కొత్త చెక్ బుక్స్ పొందాల్సి ఉంటుంది. వీటిల్లో ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కొత్తవి ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

ఏమైనా సందేహాలుంటే..

ఏదైనా సందేహాలుంటే18001802222 నెంబర్‌కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని బ్యాంకు సూచించింది. కాగా, గత ఏడాది ఏప్రిల్‌ 1న ఓరియెంటల్‌ బ్యాంకు, యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా పీఎన్‌బీలో విలీనం అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు బ్యాంకుల పనులన్నీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కింద జరుగుతున్నాయి. దీని ప్రకారం.. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, ఎంఐసీఆర్‌ కూడా మారిపోయాయి. ఈ రెండు బ్యాంకుల కోడ్‌లు ఇప్పుడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కోడ్‌తో కొనసాగనున్నాయి. ఈ విషయాలన్ని కస్టమర్ల తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడటం ఖాయం.

ఇవీ కూడా చదవండి:

SBI Offers: మీరు ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో శుభవార్త.. ఏంటంటే..!

Jio Cashback Offer: జియో బంపర్‌ ఆఫర్‌.. రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌.. ఏయే ప్లాన్స్‌పై అంటే..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3uqMysE

Related Posts

0 Response to "Bank New Rules: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా..? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel