-->
AP MPTC, ZPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. తేలనున్న 18వేల మంది భవితవ్యం.. పకడ్బందీగా ఏర్పాట్లు..

AP MPTC, ZPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. తేలనున్న 18వేల మంది భవితవ్యం.. పకడ్బందీగా ఏర్పాట్లు..

Ap Mptc, Zptc Election Results

AP MPTC, ZPTC Elections Counting: ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కోసం అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కోవిడ్ నిబంధలు, భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఐఏఎస్ అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఈ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్‌ను రద్దు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా.. సింగిల్ జడ్జ్‌ తీర్పును రద్దు చేస్తూ ఓట్ల లెక్కింపునకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎస్‌ఈసీ కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు చేసింది.

ఎంపీటీసీ స్థానాలు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వివిధ కారణాలతో నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్ధానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది మార్చి7న ఎన్నికల నిర్వహణ చేపట్టారు. మొత్తం 9672 స్ధానాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 2,371 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్ధుల మృతితో 81 స్ధానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న.. 7220 స్ధానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 18,782 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.

జడ్పీటీసీ స్థానాలు ఇలా..
ఏపీలో మొత్తం జడ్‌పీటీసీ స్థానాలు 660 ఉండగా.. ఇందులో నోటిఫికేషన్ జారీ సమయంలో.. 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి7న 652 స్ధానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చివరికి ఈ ఏడాది ఏప్రిల్ 8న.. 515 స్ధానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో మొత్తం 2058 అభ్యర్ధులు పోటీ చేశారు. ఇప్పుడు వీరందరి భవితవ్యం ఈ రోజు తేలనుంది.

Also Read:

Tragedy: విషాదం.. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృత్యువాత.. పూజల కోసం వెళ్లి..

Crime News: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం.. వెళ్తున్న కారులో..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EwMzzV

Related Posts

0 Response to "AP MPTC, ZPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. తేలనున్న 18వేల మంది భవితవ్యం.. పకడ్బందీగా ఏర్పాట్లు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel