
Andhra Pradesh TDP: హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న టీడీపీ.. కారణం ఆయన వెనక్కి తగ్గటమే..!

Andhra Pradesh TDP: టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అధిష్టానం, నేతల తీరుపట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న బుచ్చయ్య.. చంద్రబాబు తో భేటీ తరవాత మెత్తబడ్డారు. పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తానని ప్రకటించారు. దీంతో టీ కప్పులో తుపానులా బుచ్చయ్య వ్యవహారం సమసిపోయింది. అయితే, అధిష్టానం ఇచ్చిన హామీతో ఇకపై కలసి నడుస్తారా? లేదా? అంటే కాలమే సమాధానం చెబుతుంది.
వివరాల్లోకెళితే.. టీడీపీలో పెను ప్రకంపనలు సృష్టించిన సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం సమసిపోయింది. రాజమండ్రి పార్టీలో నెలకొన్న విభేదాలు, అధిష్టానం వ్యవహరిస్తోన్న తీరుపట్ల బుచ్చయ్య తీవ్ర అసంతృప్తి గా ఉన్నారు. ఈ నేపద్యంలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం టీడీపీలో ఒక్కసారిగా సునామీని సృష్టించింది. తీవ్ర చర్చకు దారితీసింది. అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్, నల్లమిల్లి రామకృష్ణ అందరూ కలిసి బుచ్చయ్యతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గలేదు. చంద్రబాబు దగ్గరకు వెళ్లనని, ఇప్పుడే ఏమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు. దాంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది.
చివరికి పార్టీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. బుచ్చయ్య తో ఫోన్ లో మాట్లాడారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, తొందర పడవద్దని సూచించారు. అధిష్టానం తరఫున ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, మాజీ మంత్రులు చిన రాజప్ప, జవహర్, నల్లమిల్లి బుచ్చయ్యతో సంప్రదింపులు జరిపారు. ఆయన లేవనెత్తిన అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో కాస్త మెత్తబడ్డ బుచ్చయ్య.. చంద్రబాబును కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు చంద్రబాబు, బుచ్చయ్య భేటీ అయ్యారు. రాజమండ్రి పార్టీలో నెలకొన్న విభేదాలు, పార్టీ అభివృద్ధి కోసం కొన్ని అభిప్రాయాలను, సూచనలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. సీనియర్ నేతగా ఉన్న బుచ్చయ్యకి పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని, తాను ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ఇకపై అలా జరగకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధిష్టానం హామీతో బుచ్చయ్య తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తానని, పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మరి రాజమండ్రి పార్టీలో నెలకొన్న విభేదాలను పక్కనబెట్టి అందరితో కలిసి నడుస్తారా? లేదా? వేచి చూడాలి.
Also read:
Telangana: జిల్లాల కలెక్టర్లకు ఈ రూల్స్ వర్తించవా?.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు?..
IND vs ENG 4th Test: బ్యాడ్ లైట్ ఎఫెక్ట్.. మూడో రోజు నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3h5OMZj
0 Response to "Andhra Pradesh TDP: హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న టీడీపీ.. కారణం ఆయన వెనక్కి తగ్గటమే..!"
Post a Comment